Ad
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాలా చోట్ల కరెంట్ కష్టాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో ఒక్కటైనా ఆంధ్రప్రదేశ్ లో కూడా విపరీతమైన విద్యుత్ కష్టాలు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వీటిపైనా రాజకీయ నాయకులు ఎప్పుడు మాటాడుతూనే ఉంటారు. మీ సమస్యలు తీరుస్తాం అంటారు.. కానీ పని చేయరు. దాంతో ప్రజలు ఆగ్రహంతో తమ గోడును సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తారు.
అయితే ఇప్పుడు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి సింగ్ కూడా ఈ కరెంట్ కష్టాలపైనా తన ఆగ్రహాన్ని ప్రకటించింది. అయితే మన ఏపీ గురించి కాదు.. తానా రాష్టం అయిన జార్ఖండ్ గురించి. తన ట్విట్టర్ వేదికగా.. విద్యుత్ పన్ను కడుతున్న వ్యక్తిగా… జార్ఖండ్లో చాలా సంవత్సరాలుగా విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను? విద్యుత్ ను సేవ్ చేయడంలో మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నం అని ఆవిడ పోస్ట్ చేసారు.
అయితే జార్ఖండ్ లో కూడా ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సంక్షోభం అనేది ఉంది. ముఖ్యంగా అక్కడ బొగ్గు నిలువలు తగిపోయాయని.. అందుకే ఈ విద్యుత్ సంక్షోభం అనేది కొనసాగుతుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు సాక్షి ఈ విషయం పైన ట్విట్టర్ వేదికగా ప్రకటించడం అనేది పెద్ద చర్చకు దారి తీస్తుంది.
ఇవి కూడా చదవండి :
Advertisement