Home » అప్పట్లో.. ధీరూబాయ్ అంబానీ ఇచ్చిన ఆఫర్ గురించి చెప్పిన ముకేశ్ అంబానీ.. ఏమన్నారంటే?

అప్పట్లో.. ధీరూబాయ్ అంబానీ ఇచ్చిన ఆఫర్ గురించి చెప్పిన ముకేశ్ అంబానీ.. ఏమన్నారంటే?

by Srilakshmi Bharathi
Ad

రిలయన్స్ ఇండస్ట్రీ వ్యాపారాన్ని ధీరూబాయ్ ప్రారంభించారన్న సంగతి తెలిసిందే. ఒక చిన్న గది లాంటి చోటులో ఈ వ్యాపారం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. తన వారసులుగా వచ్చిన అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీలకు రిలయన్స్ కంపెనీ విస్తరణ బాధ్యతలను అప్పగించాలని అనుకున్నారు. ఇద్దరూ విదేశాల్లో చదువుకుని వచ్చిన వారే. వారికి సంస్థ బాధ్యతలను నిర్వహించగలిగే బాధ్యతని అప్పగించడమే అసలైన సవాలుగా ఉంది.

Advertisement

Advertisement

ఆ సమయంలో జరిగిన సంఘటన గురించి ముఖేష్ అంబానీ చెప్పుకొచ్చారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన తరువాత.. తాను కంపెనీలో చేయాల్సిన జాబ్ ఏమిటో చెప్పాలని ముఖేష్ అంబానీ తండ్రిని అడిగారట. దానితో ధీరూబాయ్ అంబానీ ముఖేష్ అంబానీకి ఓ ఆఫర్ ఇచ్చారట. ఉద్యోగం అంటూ ఇస్తే నువ్వు కేవలం మేనేజర్ లాగ మాత్రమే ఉంటావు. అలా కాకుండా.. ఎంట్రప్రెన్యూర్ అయ్యేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టమని చెప్పారట.

ముఖేష్ ఏమి చెయ్యాలి అనే విషయాన్నీ ధీరూబాయ్ అంబానీ నిర్ణయించలేదు. తనకి తానుగా ఆలోచించుకుని డెసిషన్ తీసుకునే ఆఫర్ ను ధీరూబాయ్ ముఖేష్ అంబానీకి ఇచ్చారట. కెరీర్ గురించి స్వతంత్రంగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారట. అలా తన వ్యాపార ప్రయాణం తండ్రి ఇచ్చిన స్వేచ్ఛతో మొదలైంది అని ముఖేష్ అంబానీ చెప్పుకొచ్చారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading