ఈ మధ్య బాహుబలి పేరు ఎంత ఫేమస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతి పెద్ద వంటకానికి దేనికైనా బాహుబలి అని పేరు పెడుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో బాహుబలి థాలి తిన్న వారికి రూ.1లక్ష బహుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో కూడా బాహుబలి దోశ ఛాలెంజ్ నిర్వహిస్తున్నారు. దోశ తినండి రూ.71వేలు గెలుచుకోండి అంటున్నారు. అయితే ఆ దోశ 10 అడుగు పొడవు ఉండడం విశేషం. ప్రైజ్ మని గెలవాలంటే ఆ మొత్తాన్ని 40 నిమిషాల్లో తినేయాల్సిందే. ఇంతకు ఈ పోటీలో ఎవరైనా గెలిచారో లేదో తెలుసుకుందాం.
పది అడుగుల దోశ.. 40 నిమిషాల సమయంలో తింటే రూ.71వేలు బహుమతి అందజేస్తుంది ఢిల్లీలోని ఓ రెస్టారెంట్. కానీ సరికొత్త ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు దోశప్రియులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. 40 నిమిషాల్లో దోశను లాగించేసి రూ.71వేల చెక్ దక్కించుకుందాం అని అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఇంతకు ముందు చిన్న దోశలు వేసే వాళ్లం తరువాత పెద్దవి మొదలు పెట్టాం. దోశ పెద్దగా ఉంటే పోటీ బాగుంటుందని కస్టమర్లు బాగా వస్తారని అనుకున్నాం. అందుకే పెద్దగా తయారు చేస్తున్నాం. ఈ పోటీ ప్రారంభించి దాదాపు నెల రోజులు అవుతుంది. దాదాపు ఇప్పటి వరకు 30 మంది వరకు ప్రయత్నించారు. కానీ ఒక్కరూ కూడా గెలవలేదని రెస్టారెంట్ యజమాని శేఖర్ కుమార్ పేర్కొంటున్నాడు.
Advertisement
Advertisement
Also Read : వార్నీ…పుష్పలో ఈ డైలాగ్ ను సుకుమార్ అక్కడ నుండి కాపీ కొట్టారా..!
ఢిల్లీ ఉత్తమ్ నగర్‌లోని స్వామి శక్తి సాగర్ రెస్టారెంట్‌లో జరుగుతుంది ఈ పోటీ. ఈ ఛాలెంజ్ ప్రారంభించే ముందు పెద్ద కసరత్తే చేసారు రెస్టారెంట్ యజమాని. భారీ దోశ ప్రత్యేకంగా వేసేందుకు పెనం తయారు చేయించారు. సాదారణంగా హోటళ్లలో ఉండే పెనం 5 నుంచి 8 అడుగులుంటుంది. కానీ ఈ ఛాలెంజ్ కోసం 10 అడుగుల 4 అంగుళాల పెనం తయారు చేయించారు. పెనం వేడిగా ఉంటే ఒక దోశ వేసేందుకు 7 నుంచి 8 నిమిషాల సమయం పడుతుందని నిర్వాహకుడు శేఖర్‌కుమార్ చెబుతున్నారు. ఈ భారీ దోశ ధర రూ.1500. అంత మొత్తం చెల్లించి పోటీలో పాల్గొన్న వారిలో ఒక్కరూకూడా ఇప్పటివరకు గెలవలేదు. అయితే దోశ రుచిగా, నాణ్యంగా ఉండడం వల్ల పోటీదారులు పెద్దగా బాధపడటం లేదని శేఖర్ చెబుతున్నారు.
Also Read : Lavanya tripathi : వరుణ్ తేజ్ తో పెళ్లిపై స్పందించిన లావణ్య త్రిపాఠి…!