Home » తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 544 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్‌.. పోస్టుల వివరాలు, తేదీలు ఇవే

తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 544 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్‌.. పోస్టుల వివరాలు, తేదీలు ఇవే

by Bunty
Ad

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కారు. ఇక తాజాగా మరోసారి విద్యార్థులకు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 544 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisement

ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 31,2023 నుంచి ప్రారంభం అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 20, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు,
ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు:29

Advertisement

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు సబ్జెక్టుల వారీగా,

కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ పోస్టులు:311
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులు:39
కామర్స్ బిజినెస్ అనలిటిక్స్ పోస్టులు:8
డైరీ సైన్స్ పోస్టులు:8
క్రాప్ ప్రొడక్షన్ పోస్టులు:4
డేటా సైన్స్ పోస్టులు:12
ఫిషరీస్ పోస్టులు:3
కామర్స్-విదేశీ వాణిజ్యం పోస్టులు:1
కామర్స్ ట్యాక్సేషన్ పోస్టులు:6
ఇంగ్లీష్ పోస్టులు:23
తెలుగు పోస్టులు:27
ఉర్దూ పోస్టులు:2
సంస్కృతం పోస్టులు:5
స్టాటిస్టిక్స్ పోస్టులు:23
మైక్రో బయాలజీ పోస్టులు:5
బయోటెక్నాలజీ పోస్టులు:9
అప్లైడ్ న్యూట్రిషన్ పోస్టులు:5

read also  : అట్లుంటది మనతోని..! మద్యం విక్రయాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డు.. 2022లో రికార్డు బద్దలు

Visitors Are Also Reading