Telugu News » Blog » అట్లుంటది మనతోని..! మద్యం విక్రయాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డు.. 2022లో రికార్డు బద్దలు

అట్లుంటది మనతోని..! మద్యం విక్రయాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డు.. 2022లో రికార్డు బద్దలు

by Bunty
Ads

తెలంగాణలో మందుబాబులు బీభత్సంగా తాగేస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమమైనా మొదట తాగేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు మందుబాబులు. దీనికి నిదర్శనం.. డిసెంబర్ 31వ తేదీ మద్యం అమ్మకాలు. అవును కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో మందుబాబులు బీభత్సం గా తాగేశారు. ఆకాశమే హద్దుగా మందు కోసం ఖర్చు పెట్టారు. ఈ విషయాన్ని తెలంగాణ ఎక్సైజ్ శాఖ క్లియర్ కట్ గా ప్రకటించింది.

Advertisement

2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రూ.34,352.75 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. 2021లో మొత్తం రూ.18,868 కోట్ల అమ్మకాలు జరిగితే, 2020 లో మొత్తం కలిపి రూ.16,254 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2021 లో 2.73 కోట్ల లిక్కర్,2.45 కోట్ల బీర్ కేసులు విక్రయించగా, గత ఏడాది 3.5 కోట్ల లిక్కర్, 4.5 కోట్ల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి.2020,2021 కంటే గత ఏడాదిలో మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో జరిగాయి. 2022 డిసెంబర్ నెలలో రూ.3,376 కోట్ల మద్యం అమ్ముడుపోగా, 2021 డిసెంబర్ లో రూ.2,901 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2021 ఏడాది కంటే గత ఏడాది డిసెంబర్ లో ఆదణంగా రూ.475 కోట్లు పెరిగింది.

Advertisement

2022 డిసెంబర్ చివరి వారంలో ఏకంగా రూ.1000 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 31న రూ.215.74 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, డిసెంబర్ 30న రూ.254 కోట్లు, డిసెంబర్ 29న రూ.159 కోట్లు, డిసెంబర్ 28న రూ.144 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31న అర్థరాత్రి ఒంటిగంట వరకు మద్యం అమ్మకాలతో అనుమతి ఇవ్వడం కూడా ఈ ఏడాది మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరగడానికి కారణమని తెలుస్తోంది.

Advertisement

read also : విలన్ తో తమన్నా డేటింగ్.. వీడియో లీక్ !