Telugu News » లైవ్ లో దీప్తి ఎమోష‌న‌ల్…గుండె ప‌గిలిపోయిందంటూ ష‌ణ్ముక్ పోస్ట్..!

లైవ్ లో దీప్తి ఎమోష‌న‌ల్…గుండె ప‌గిలిపోయిందంటూ ష‌ణ్ముక్ పోస్ట్..!

by AJAY MADDIBOINA
Published: Last Updated on

సోష‌ల్ మీడియా స్టార్స్ దీప్తి సునైనా ష‌ణ్ముక్ ఐదేళ్ల రిలేష‌న్ త‌ర‌వాత బ్రేక‌ప్ చెప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఎంతో అందంగా ఉండే ఈ జంట పెళ్లి చేసుకుని క‌ల‌కాలం క‌లిసి ఉంటార‌ని అంతా భావించారు.

Ads

కానీ అలా జ‌ర‌గ‌కుండా ఇద్ద‌రూ విడిపోయారు. రిలేష‌న్ షిప్ లో ఉన్న స‌మ‌యంలో వీరిద్ద‌రూ క‌లిసి చ‌క్క‌ర్లు కొట్ట‌డం..లైవ్ లోకి వ‌చ్చి అభిమానులతో ముచ్చ‌టించ‌డం చేసేవారు. దాంతో అభిమానులు వీరి లైవ్ ముచ్చ‌ట్లను ఎంజాయ్ చేసేవారు.

deepthi shanmukh

deepthi shanmukh

కానీ ఏం జ‌రిగిందో ఏమోగానీ ష‌ణ్ముక్ బిగ్ బాస్ నుండి రాగానే దీప్తి సునైనా అత‌డికి బ్రేక‌ప్ చెప్పింది. ఓ ఎమోష‌నల్ పోస్ట్ పెట్టింది. దాంతో ష‌ణ్ముక్ ఆమె నిర్ణ‌యాన్ని గౌర‌విస్తానంటూ పోస్ట్ పెట్టారు. తన‌కు ఇంత‌కాలం స‌పోర్ట్ చేసినందుకు చాలా థాంక్స్ టేక్ కేర్ అంటూ గుడ్ బై చెప్పాడు. ఇక రీసెంట్ గా దీప్తి లైవ్ లోకి వ‌చ్చి ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న కెరీర్ గురించి ఆలోచించ‌లేద‌ని ఇప్ప‌టి నుండి కెరీర్ పై ఫోక‌స్ పెడ‌తానంటూ స‌డెన్ గా లైవ్ లో నుండి వెళ్లిపోయింది.

also read : వాళ్ల బెదిరింపుల వళ్లే ఇద్ద‌రూ విడిపోయారా..? దీప్తి ష‌ణ్ముబ్రేక‌ప్ వెన‌కాల ఇంత క‌థ ఉందా..!

ఇదిలా ఉండ‌గా తాజాగా ష‌ణ్ముక్ కూడ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. తాను డ‌ల్ గా ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి ఆ ఫోటోకు హార్ట్ బ్రేక్ ఎమోజీల‌ను జోడించాడు. దాంతో ష‌ణ్ముక్ అభిమానులు అత‌డిని ధైర్యం చెబుతున్నారు. మ‌రోవైపు దీప్తి ష‌ణ్ముక్ ల‌తో వీడియోలు చేసిన ఓ ద‌ర్శ‌కుడు ఇద్ద‌రికి మంచి స్నేహితుడు దీప్తిని ఒప్పించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది.


You may also like