Home » వాళ్ల బెదిరింపుల వళ్లే ఇద్ద‌రూ విడిపోయారా..? దీప్తి ష‌ణ్ముబ్రేక‌ప్ వెన‌కాల ఇంత క‌థ ఉందా..!

వాళ్ల బెదిరింపుల వళ్లే ఇద్ద‌రూ విడిపోయారా..? దీప్తి ష‌ణ్ముబ్రేక‌ప్ వెన‌కాల ఇంత క‌థ ఉందా..!

by AJAY
Ad

దీప్తి సునైనా, ష‌ణ్ముక్ జ‌ష్వంత్ ఈ రెండూ ప‌రిచయం అక్క‌ర్లేని పేర్లు. ముఖ్యంగా సోష‌ల్ మీడియా వాడే ప్ర‌తిఒక్క‌రికీ వీళ్లిద్దరూ భాగా తెలుసు. దీప్తి డ‌బ్స్ మాష్ ల‌తో ఫేమ‌స్ అవ్వ‌గా ష‌ణ్ముక్ యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ లు డ్యాన్స్ వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇద్ద‌రూ సోష‌ల్ మీడియా స్టార్ లు కావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య పరిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్తా కొద్ది రోజుల‌కు ప్రేమ‌గా మారింది. దాంతో దీప్తి ష‌ణ్ము అంటూ అభిమానులు ఫ్యాన్ పేజీలు కూడా పెట్టేసుకున్నారు. ఒక‌రి అభిమానులు మ‌రొక‌రిని అభిమానించ‌డం మొద‌లు పెట్టారు. ఇక సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన పాపులారిటీతో దీప్తి బిగ్ బాస్ 3 లోకి ఎంట్రీ ఇచ్చింది. మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు కూడా వ‌చ్చేసింది.

Advertisement

deepthi sunaina shanmuk breakup

deepthi sunaina shanmuk breakup

ష‌ణ్ముక్ యూట్యూబ్ లో చేసిన సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప‌ర్ వెబ్ సిరీస్ కు మంచి క్రేజ్ వ‌చ్చింది. ఈ సీజ‌న్ ప్ర‌తి ఎపిసోడ్ కూ మిలియ‌న్ల కొద్దీ వ్యూవ్స్ వ‌చ్చాయి. ఆ త‌ర‌వాత తీసిన సూర్య వెబ్ సిరీస్ కూడా మంచి విజ‌యం సాధించింది. దాంతో ష‌ణ్ముక్ కూడా సోష‌ల్ మీడియా స్టార్ బిగ్ బాస్ 5లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక్క‌డి వ‌ర‌కూ అంతా భాగానే ఉండ‌గా ఇక్క‌డే అంతా బెడిసి కొట్టింది. బిగ్ బాస్ లో ఉన్న‌న్ని రోజులు ష‌ణ్ముక్ కు స‌పోర్ట్ చేసిన దీప్తి బ‌య‌టకు రాగానే బ్రేక‌ప్ చెప్పేసింది. అయితే ఈ బ్రేక‌ప్ కు కార‌ణం మాత్రం సిరినే అని సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. అందుకు కార‌ణం కూడా ష‌ణ్ముక్ సిరిలే.

Advertisement

also read: విక్ర‌మ్ త‌న‌యుడు మామూలోడు కాదు..ఒక్క సినిమాకే హీరోయిన్ తో డేటింగ్..!

ష‌ణ్ముక్ అప్ప‌టికే దీప్తితో రిలేష‌న్ షిప్ లో ఉన్నాడు. సిరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. కానీ ఇద్ద‌రూ అది మ‌ర్చిపోయి హ‌గ్గులు ఇచ్చుకోవ‌డం..ముద్దులు పెట్టుకోవ‌డం మొద‌లెట్టారు. దాంతో దీప్తి హర్ట్ అయ్యి బ్రేక‌ప్ చెప్పింది అని అంతా అనుకుంటున్నారు. అయితే బ్రేక‌ప్ కు మ‌రోకార‌ణం కూడా ఉంద‌ట‌. రిలేష‌న్ షిప్ లో ఉండి కూడా అలా చేసిన ష‌ణ్ముక్ తో రిలేష‌న్ షిప్ క‌ట్ చేసుకోవాల‌ని దీప్తి పేరెంట్స్ ఒత్తిడి తీసుకువ‌చ్చార‌ట‌. అలాంటి వాడిని పెళ్లి చేసుకోవ‌డానికి వీళ్లేదంటూ బెదిరించార‌ట‌.

Visitors Are Also Reading