Home » Dec 26th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Dec 26th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

కరోనాపై కేంద్రం అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలను ఇప్పటికే సంసిద్ధం కావాలని కోరింది. రేపు కోవిడ్ డ్రై రన్ నిర్వహించనుంది. ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Advertisement

గడచిన 24 గంటల్లో దేశంలో 196 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 3,428 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,46,77,302 కేసులు,5,30,695 మరణాలు నమోదయ్యాయి.

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో BRS, BJP అభ్యర్థుల మధ్య హోరా హోరీ పోరు.. వేములవాడ రూరల్ మండలం,సిరిసిల్ల టౌన్ లో బీజేపీ ఆధిక్యం, రెండు స్థానాల్లో బీజేపీ.రెండు స్థానాల్లో BRS, ఒక్క స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యతలో ఉన్నాయి.

 

మరింత విషమించిన బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు పీలే ఆరోగ్యం.. ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నట్టు సమాచారం.

 

అమెరికాను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్…. 31 మంది చనిపోగా న్యూయార్క్ నగరాన్ని ముంచేస్తున్న మంచు.. అంధకారంలో లక్షలాదిమంది.. అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోంది.

 

తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు టీంలోని ఇషాన్ శర్మ, తాతినేని శశాంక్, మండ ప్రతాప్ లను విచారించనున్న సైబర్ క్రైం పోలీసులు.. ప్రభుత్వంపై వివిధ పోస్ట్ లు చేస్తూ కించపరిచే విధంగా చేస్తున్నారని 41A నోటీసులు జారీచేసిన పోలీసులు.

Advertisement

 


డిల్లీలో ప్రముఖులకు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. వీర్ భూమి,శక్తి స్థల్,శాంతి వన్, విజయ్ ఘాట్,అటల్ స్మృతి స్థల్,రాజ్ ఘాట్ వద్ద నివాళులర్పించిన రాహుల్ గాంధీ.. జనవరి 3 న తిరిగి భారత్ జూడో యాత్ర ప్రారంభం కానుంది.

 

తిరుమల16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న70,373 మంది భక్తులు….తలనీలాలు సమర్పించిన 32,954 మంది భక్తులు…హుండీ ఆదాయం రూ. 5.05 కోట్లు వచ్చినట్టు సమాచారం.

 

నేడు కాపునాడు బహిరంగ సభ జరుగుతోంది.వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా ఛలో వైజాగ్…ఏ.ఎస్.రాజా గ్రౌండ్స్ లో పూర్తయిన ఏర్పాట్లు…..వేలాదిగా తరలివస్తారని నిర్వాహకులు అంచనా….సభకు హాజరయ్యే రాజకీయ ముఖ్యులపై సస్పెన్స్ నెలకొంది.

 

గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. పోటాపోటీగా రంగా వర్దంతి కార్యక్రమం నిర్వహిస్తోన్న వైసీపీ – టీడీపీ… రంగా వర్దంతి మీరెలా నిర్వహిస్తారంటూ రావికి కొడాలి నాని అనుచరుల ఫోన్లు.. టీడీపీ ఆఫీసులోకి దూసుకొచ్చే ప్రయత్నం చేసిన వైసీపీ..రంగా వర్దంతి జరిపి తీరతామని టిడిపి చెబుతోంది.

Visitors Are Also Reading