Home » Dec 18th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Dec 18th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

తిరుపతి చంద్రగిరి (మం) అగరాల నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ స్టెఫ్నీ టైర్ ఊడి వెనుక వస్తున్న కారుపై పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమలై నుంచి తిరుమలకు వస్తున్న ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.


తిరుమల 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 64,107 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,482 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు.

Advertisement

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. తుఫాను ప్రభావం లేకపోవడంతో మళ్ళీ చలి తీవ్రత పెరిగింది. అరకు లోయకు పర్యాటకుల రద్దీ పెరిగింది.

ఆదిలాబాద్ లోని కేస్లాపూర్ లో నాగోబా విగ్రహ పున:ప్రతిష్ఠ జరగనుంది. నాగోబా ఆలయ పునర్నిర్మాణం.. సొంత ఖర్చులు, చందాలతో రూ.5 కోట్లతో మెస్రం వంశీయులు గుడి నిర్మించుకున్నారు.

Advertisement

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ లో 14.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్ లో 14.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలపై అధిష్టానం నజర్ పెట్టింది. సమస్య పరిష్కారం కోసం ఢిల్లీ రావాలని సీనియర్‌ నేతలకు అధిష్టానం పిలుపునిచ్చింది. వాస్తవ పరిస్థితులను ముక్త కంఠంతో అధిష్టానానికి వినిపించే యోచనలో సీనియర్లు ఉన్నారు.

హైదరాబాద్‌ నకిలీ మద్యం కేసులో బయటపడుతున్న నిజాలు.. మునుగోడు ఉప ఎన్నికలే టార్గెట్‌గా ఏరులై పారిన నకిలీ మద్యం.. ఒడిశా నుంచి కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని డంప్‌ చేసిన కేటుగాళ్లు.. నకిలీ మద్యం అమ్మకాలతో తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఆదాయం భారీగా పడిపోయింది.

మధుమేహం వ్యాధి గ్రస్తుల్లో చైనా భారత్ పోటీ పడుతున్నాయి. 141 మిలియన్స్ మందితో చైనా నంబర్ 1 స్థానం లో ఉంటే 77 మిలియన్ ల మందితో భారత్ రెండో స్థానం లో ఉంది.

Visitors Are Also Reading