నేచురల్ స్టార్ నాని గురించి తెలియని వారుండరు. గతేడాది శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని తర్వాత అంటే సుందరానికి మూవీతో అలరించాడు. ఇక ఈ ఏడాది దసరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తుంది.
Read also : Sreeleela : 10 సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తున్న శ్రీలీలా!
Advertisement
ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కోల్లకొడుతోంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ తో పాటు అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది దసరా సినిమా. పాన్ ఇండియా లెవెల్లో విడుదలై కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మే 30 నుంచి దసరా సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 22 కోట్లకు దసరా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
Advertisement
read also : అప్పుడు ఆశు రెడ్డి… ఇప్పుడు సురేఖ వాణి…వర్మ చేతిలో పడితే అంతే…!
అయితే హిందీ వెర్షన్ హక్కులను మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఓవైపు థియేటర్లలో సత్తా చాటిన ఈ సినిమా ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతుంది. ఇందులోని చమ్కిల అంగిలేసి సాంగ్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలోని డిలీటెడ్ సీన్స్ కూడా యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.
read also : మెగా ఫ్యామిలిలో కల్లోలం.. ప్రియుడి ఫోటోలను షేర్ చేసిన నిహారిక ?