గత రెండు సంవత్సరాలుగా ఐపిఎల్ జట్టు అయిన సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టోర్నమెంట్లో ఘోరంగా విఫలమౌతూ వస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో… తొలిసారిగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపిఎల్ ఛాంపియన్గా అవతారం ఎత్తింది. ఇక డేవిడ్ వార్నర్ జట్టులోంచి బయటికి వెళ్లిన తర్వాత… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితి చాలా దారుణంగా తయారయింది.
Advertisement
ఇక చివరిసారిగా జరిగిన ఐపీఎల్ 2023 టోర్నమెంట్లో కూడా హైదరాబాద్ జట్టు అత్యంత దారుణ ప్రదర్శన కనబరిచింది. కెప్టెన్ గా సౌత్ ఆఫ్రికా కు చెందిన డేంజర్ ప్లేయర్ మర్క్రం ను తీసుకువచ్చిన ఫలితం లేకపోయింది. పాయింట్స్ టేబుల్ లో చిట్టచివరి నుంచి రెండవ స్థానంలో నిలిచింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇక ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో ఎలాగైనా కప్ కొట్టేందుకు హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారాన్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
Advertisement
అయితే ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ జట్టు ఓనరు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ జట్టు కోచ్ గా ఉన్న లారాను పక్కకు పెట్టి.. అతని ప్లేస్ లో న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ వెటోరిని తీసుకువచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇక ఐపీఎల్ 2024 టోర్నమెంటుకు… కోచ్ వెటోరి ఆధ్వర్యంలో బరిలోకి దిగనుంది హైదరాబాద్ జట్టు. గతంలో ఆర్సిబి జట్టు ప్లేయర్ గా ఉన్న డేనియల్ వెటోరి ఇప్పుడు హైదరాబాద్ హెడ్ కోచ్ గా రావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
ఇవి కూడా చదవండి
సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !
“రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?
ఆ హీరోకు లవర్ గా, సిస్టర్ గా నటించిన తమన్నా…!