Home » స‌మంత పోస్ట్ కు స్పందించిన కోహ్లీ భార్య‌…ఇంట్రెస్టింగ్ రిప్లై ఇవ్వ‌డంతో వైర‌ల్..!

స‌మంత పోస్ట్ కు స్పందించిన కోహ్లీ భార్య‌…ఇంట్రెస్టింగ్ రిప్లై ఇవ్వ‌డంతో వైర‌ల్..!

by AJAY
Ad

టాలీవుడ్ ముద్దుగుమ్మ స‌మంత మెల్లిమెల్లిగా మ‌యోసైటిస్ నుండి కోలుకుంటోంది. నాగ‌చైత‌న్యతో విడాకుల త‌ర‌వాత చాలా కాలం పాటూ స‌మంత సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. చైతూతో క‌లిసి ఉన్న‌ప్ప‌టి కంటే విడాకుల త‌ర‌వాత‌నే సోషల్ మీడియాలో స‌మంత ఎక్కువ‌గా కనిపించింది. త‌ర‌చూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానుల‌ను ప‌ల‌క‌రించింది. ఇక విడాకుల త‌ర‌వాత పుష్ప సినిమాలో ఊ అంటావా పాట‌కు స్టెప్పులు వేసి ఏకంగా పాన్ ఇండియాతోనే డ్యాన్స్ లు వేయించింది.

ALSO READ :“అత‌డు” సినిమాలోని ఈ మిస్టేక్ ను గ‌మనించారా..? ఆడియ‌న్స్ ని గురూజీ మోసం చేశాడంటూ ట్రోల్స్..!

Advertisement

అంతా బాగుంది అనుకుంటున్న స‌మయంలో మ‌యోసైటిస్ అనే మాయ‌దారి రోగం స‌మంతకు వ‌చ్చింది. ఆ త‌ర‌వాత స‌మంత చాలా కాలం పాటూ సోష‌ల్ మీడియాకు మ‌రియు సినిమాల‌కు సైతం దూరం అయ్యింది. ఇక చికిత్స త‌ర‌వాత స‌మంత తిరిగి కోలుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా మ‌ళ్లీ సామ్ వ‌ర్కౌట్ లు కూడా మొద‌లుపెట్టింది. అదేవిధంగా పులిస్టాప్ పెట్టిన సినిమాల షూటింగ్ లో బిజీగా ఉంటోంది.

Advertisement

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టిస్తున్న ఖుషి సినిమాలో న‌టిస్తోంది. అదేవిధంగా సిటాడెల్ అనే మ‌రో వెబ్ సిరీస్ లోనూ స‌మంత న‌టిస్తోంది. ఇక సినిమాలతో పాటూ మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో దేవుడిని పూజిస్తున్న ఫోటోను షేర్ చేసి ఆ ఫోటోకు క్యాప్ష‌న్ ఇచ్చింది. మనం ఎంత బలవంతులమైనా… కొన్నిసార్లు సమస్యలను ఎదుర్కొన‌లేము.

అలాంటప్పుడు మనపై మనకు ఉన్న‌ నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. నమ్మకం మీకు ప్రశాంతతను ఇస్తుంది. నమ్మకం మీకు అన్నీ నేర్పిస్తుంది. నమ్మకం మీకు నేస్తంగా మారుతుంది. నమ్మకం మిమ్మల్ని ఓ మహత్తరమైన శక్తిగా మారుస్తుంది. అంటూ పేర్కొన‌గా ఆ పోస్ట్ కు కోహ్లీ స‌తీమ‌ణి అనుష్క‌శర్మ ఎస్ అంటూ రిప్లై ఇచ్చింది.

ALSO READ : నాగార్జున సినిమాకు పోటీగా జూనియ‌ర్ ఎన్టీఆర్ బాల‌రామాయ‌ణం…ఆ సినిమా రిజ‌ల్ట్ ఏంటంటే..?

Visitors Are Also Reading