సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF )హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1315 ఖాళీలున్నాయి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
అర్హత ప్రమాణాలు:
దరఖాస్తుదారులు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన విద్యా బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా పురుషులు 165 సెంటీమీటర్లు , మహిళలు 155 సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉండాలి.
Advertisement
వయోపరిమితి :
2023 జనవరి 25 నాటికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
also read:మీ కంటి చూపు సరిగ్గా కనిపిస్తుందా? అయితే ఈ ఫోటోలో దాగి ఉన్న కుందేలును గుర్తించండి ?
జీతభత్యాలు: హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు 25,500రూపాయల నుండి 81,100 రూపాయల వరకు జీతం ఉంటుంది.
Advertisement
ఎంపిక ప్రక్రియ:
శారీరక పరీక్షలు
వ్రాత పరీక్ష
పత్రాల ధృవీకరణ
వైద్య పరీక్షలు
CRPF HC మినిస్టీరియల్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు రుసుముగా దరఖాస్తుదారులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా R.100/- మొత్తాన్ని చెల్లించాలి.
అప్లై విధానం:
ముందుగా CRPF అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
రిక్రూట్‌మెంట్స్ విభాగంలోకి వెళ్లి HC మినిస్టీరియల్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని పూర్తిగా తనిఖీ చేయండి. ఆపై,ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేసి, పూర్తి సమాచారాన్ని ఎంటర్ చేయండి.
స్కాన్ చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయండి. దరఖాస్తు రుసుము చెల్లించండి.
చివరగా, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, దాన్ని ప్రింట్ తీసుకోండి.
దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి 4.
దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 25.
పరీక్ష తేదీ : ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్య ఉంటుంది.
వెబ్‌సైట్: http://crpf.gov.in
also read: