Home » క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్, విశాఖలో టీమిండియా మ్యాచ్‌లు

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్, విశాఖలో టీమిండియా మ్యాచ్‌లు

by Bunty
Ad

బంగ్లాదేశ్ పర్యటన అనంతరం సొంత గడ్డపై శ్రీలంకతో మూడేసి వన్డేలు, టీ20 సిరీస్ లో ఆడనున్న టీమిండియా, తర్వాత న్యూజిలాండ్ తో వరుసగా మూడు మ్యాచ్ ల వన్డే టీ 20 సిరీస్ లో తలపడనుంది. అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 భాగంగా ఆస్ట్రేలియా తో నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఆసీస్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో తలపడనుంది. అయితే ఈ షెడ్యూల్ లో హైదరాబాద్ కు ఓ మ్యాచ్ ఆతిధ్యం ఇచ్చె అవకాశం దక్కింది.

Read Also : గుడ్‌ న్యూస్‌ చెప్పిన హాట్‌ బ్యూటీ.. క్యాన్సర్‌ను జయించి మరీ షూటింగ్‌కు !

Advertisement

న్యూజిలాండ్ తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ లో జనవరి 18న జరగనున్న తొలి వన్డేకు భాగ్యనగరంలోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. టి20 ప్రపంచ కప్ ముందు హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ కోసం అభిమానులు ఎగబడ్డారు. టికెట్ల పంపిణీ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం కారణంగా తొక్కిసలాట కూడా జరిగింది. పెద్ద ఎత్తున టికెట్లు పక్కదారి పట్టాయని విమర్శలు కూడా వచ్చాయి.

Advertisement

చివరకు ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. సుమారు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరగడంతో అభిమానులు పోటెత్తారు. మరోసారి మ్యాచ్ జరగనుండటంతో హెచ్ సీఎ ఎలా ఏర్పాట్లు చేస్తుందో చూడాలి. విశాఖపట్నం కూడా ఓ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా తో జరగనున్న 3 వన్డేల సిరీస్ లో మార్చ్ 19న జరగనున్న రెండో వన్డే కు విశాఖపట్నం వేదికగా ఎంపికైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు కూడా అభిమానులు పోటెత్తనున్నారు. వైజాగ్ వేదికగా మ్యాచ్ జరిగే చాలా రోజులు అయింది. ఇక్కడ ఐపీఎల్ 2023 మ్యాచ్ లు జరిగే అవకాశం లేకపోవడంతో ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు.

read also : తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. TSPSC నుంచి మరో భారీ జాబ్ నోటిఫికేషన్..

Visitors Are Also Reading