Home » తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. TSPSC నుంచి మరో భారీ జాబ్ నోటిఫికేషన్..

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. TSPSC నుంచి మరో భారీ జాబ్ నోటిఫికేషన్..

by Bunty
Published: Last Updated on
Ad

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులపై దృష్టి సారించింది. నిరుద్యోగుల ఓట్లను రాబట్టేందుకు… వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే పోలీస్ శాఖలో దాదాపు 16 వేల పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం… ఇటు గ్రూప్ 4, గ్రూప్ 2, అలాగే రెవెన్యూ అటు వైద్యశాఖలో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా… తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లు పేర్కొన్నారు.

Read Also : గుడ్‌ న్యూస్‌ చెప్పిన హాట్‌ బ్యూటీ.. క్యాన్సర్‌ను జయించి మరీ షూటింగ్‌కు !

Advertisement

మొత్తం 19 సబ్జెక్టులకు సంబంధించి 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 14న ప్రారంభం కానుండగా, దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన డీటైల్డ్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనుంది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు ఈ నెల 14 నుంచి టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ www.tspsc.gov.in వెబ్సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

ఇదిలా ఉంటే తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1147 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మెడికల్ విద్య పూర్తి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యరోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 20, 2022 ఉదయం 10:30 గంటల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ

తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. 1392 లక్షల పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఈ నోటిఫికేషన్ లో వెల్లడించింది.

read also : BCCI సంచలన నిర్ణయం..IPL విదేశీ ప్లేయర్లకు ఎదురుదెబ్బ !

Visitors Are Also Reading