Home » చిరంజీవి మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. మెగా 156 కు టైటిల్‌ ఫిక్స్..!

చిరంజీవి మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. మెగా 156 కు టైటిల్‌ ఫిక్స్..!

by Anji
Ad

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్నసినిమాలలో తాజా చిత్రం మెగా 156. ఈ చిత్రానికి బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఇటీవలే దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పూజా కార్యక్రమాలతో లాంఛ్ చేశారు. లాంఛింగ్ వీడియో, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ సినిమా టైటిల్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించాడు మెగాస్టార్ చిరంజీవి. మెగా 156 చిత్రానికి విశ్వంభర అనే  టైటిల్‌ను ఖరారు చేశారు. 

Advertisement

చిరంజీవి విశ్వంభర టైటిల్‌ లుక్‌ను ట్వీట్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా లాంఛింగ్ రోజే మ్యూజిక్‌ సిట్టింగ్‌ పనులు కూడా మొదలయ్యాయని అప్‌డేట్ అందించారు మూవీ మేకర్స్‌. ఈ చిత్రంలో చిరంజీవి కథానుగుణంగా దేవ, దానవ, పాతాళ, యక్ష, భూ లోకాలన్నీ తిరిగి వస్తాడట. మొత్తం అయిదు లోకాలకు అయిదుగురు హీరోయిన్లను ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తుంది.. వీరిలో అనుష్కా శెట్టి, మృణాళ్‌ ఠాకూర్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముందు ముందు  రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలంటున్నారు మెగాస్టార్ అభిమానులు. 

Advertisement

 

https://x.com/chiranjeeviarmy/status/1719642684967854174?s=20

సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా.. మీ అందరికీ సినిమాటిక్ అడ్వెంచర్‌ను అందించడానికి సిద్దం.. అంటూ డైరెక్టర్ వశిష్ఠ అనౌన్స్‌మెంట్‌ సమయం నుంచి సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. ఈ చిత్రాన్ని లీడింగ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ తెరకెక్కిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం. కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నారు. చాలా రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించడం విశేషమనే చెప్పాలి. 

మరిన్ని   సినిమాల  కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading