Home » “క్రాక్” సినిమా విలన్ కటారి కృష్ణ రియల్ గానే ఉన్నారని తెలుసా? ఇప్పుడు ఎలా ఉన్నారు ఏమి చేస్తున్నారంటే?

“క్రాక్” సినిమా విలన్ కటారి కృష్ణ రియల్ గానే ఉన్నారని తెలుసా? ఇప్పుడు ఎలా ఉన్నారు ఏమి చేస్తున్నారంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

రవితేజ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన సినిమా “క్రాక్”. ఈ సినిమాలో విలన్ కటారి కృష్ణగా దర్శకుడు సముద్రఖని నటించిన సంగతి తెలిసిందే. అయితే.. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా కటారి కృష్ణ ఉన్నారు. సినిమా తరహాలోనే ఆయన రియల్ లైఫ్ లో కూడా గొంతులు కోశారు. ఆయన గురించి తెలుసుకున్న గోపిచంద్ మలినేని సినిమా తీయడానికి ముందే కటారి కృష్ణను కలుసుకున్నారట.

katari krishna

Advertisement

ఆయనను కలిసి ఆయన లైఫ్ గురించి మాట్లాడిన తరువాతే ఆ పాత్రని “క్రాక్” సినిమాలో పెట్టారట. అయితే.. రియల్ లైఫ్ లో కటారి కృష్ణ మొదటిలో కఠినంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన చాలా మారారు. ప్రస్తుతం ఆయన ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటున్నారు. 1970 నుంచి 2000 సంవత్సరం దాకా ఒంగోలు ప్రాంతంలో కటారి కృష్ణ పేరు చెబితే జనాలు వణికిపోయేలా పరిస్థితి ఉండేది. గోపాల పురానికి చెందిన ఈయన మోటార్ ఫీల్డ్ లో పనిచేసేవారు. క్రైమ్ బ్రాంచ్ కు లీడర్ గా మారిన కటారి కృష్ణ చిన్న చిన్న గొడవలను పెద్దవిగా చేసి హత్యకు దారితీసేలా చేసేవారు.

katari krishna 1

Advertisement

మరో గ్రూప్ లీడర్స్ అయిన చింతల నారాయణ, పిచ్చయ్య లపై హత్య యత్నం చేసిన కేసులో 14 మందికి జైలు శిక్ష పడింది. వారిలో కటారి కృష్ణ కూడా ఉన్నారు. ఈ జైలు నుంచి వచ్చిన తరువాత ఆయన మరింత కఠినంగా మారడంతో జనాలు వణికిపోయేవారు. మరోసారి ఆయన ఎన్నికల సమయంలో వెంకటసుబ్బయ్య అనే వ్యక్తిని హత్య చేసి జైలుకెళ్లారు. సినిమాలో లాగానే ఆయనకు రెండవ భార్యగా జయమ్మ ఉండేవారు. ఆమె హత్య తరువాత.. రౌడీయిజాన్ని తగ్గించారు. మొదటి భార్యా, పిల్లలు కూడా ఆయనకు దూరం అయ్యారు. చివరికి ఎవరు తోడు మిగలలేదని కన్నీళ్లు పెట్టుకున్నారట. దందాలు చేస్తూ బిర్యానీలు తిన్న ఆయన ఇప్పుడు ఉల్లిపాయలు అమ్ముకుంటూ గంజి నీళ్లు తాగుతున్నారట. కానీ, అప్పటి కంటే ఇప్పుడే బాగుందని కటారి కృష్ణ చెబుతున్నారట.

మరిన్ని..

ప్రభాస్, అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇన్నాళ్లకు ఆ ముచ్చట తీరనుంది..!

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !

Visitors Are Also Reading