Home » తిరుపతిలో ఒక్కరోజు అన్నదానం చేయాలంటే ఖర్చు ఇన్ని లక్షలా..?

తిరుపతిలో ఒక్కరోజు అన్నదానం చేయాలంటే ఖర్చు ఇన్ని లక్షలా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి దేవస్థానం.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది టీటీడీ.. ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ప్రతిరోజు వచ్చి దర్శించుకుంటారు. అలాంటి టీటీడీకి ప్రతిరోజు కోట్లాది రూపాయల కట్ల కానుకలు కూడా వస్తుంటాయి. ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక అట్రాక్షన్ తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పవచ్చు. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతోమంది భక్తులు కోరిన కోరికలు నెరివేరితే హుండీలలో వివిధ కానుకలు వేస్తూ ఉంటారు.

also read:CITADEL REVIEW : “సిటాడెల్” వెబ్ సిరీస్ రివ్వ్యూ..అదిరిపోయే యాక్ష‌న్ తో..!

Advertisement

అంతేకాకుండా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూద్దామా.. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఎంతో ప్రాచుర్యం పొందిన దేవాలయం. ఈ గుడికి ప్రతి రోజు వచ్చే ఆదాయం మూడు నుంచి నాలుగు కోట్లు పైగానే ఉంటుందట. అలా కొంతమంది భక్తులు హుండీలలో కానుకలు వేస్తే , మరికొంతమంది అన్నదానం చేయాలనుకుంటారు. ప్రస్తుతం తిరుపతిలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రం ద్వారా ప్రతిరోజు 60 వేల నుంచి 70 వేల మంది అన్న ప్రసాదాలను అందిస్తారు.

Advertisement

also read:25 ఏళ్ల సినీ కెరీర్ లోనే అతిపెద్ద లాస్.. దిల్ రాజు కామెంట్స్ వైరల్..!

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్ లో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. వీటి ద్వారా వచ్చిన భక్తులకు ఉచితంగా అన్నదానం పెడుతూ ఉంటారు. ఈ విధంగా ఒక్కరోజు అన్నదానం చేయాలనుకుంటే టీటీడీకి విరాళంగా 33 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. ఈ డబ్బులు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేస్తే వారు మీ పేరు మీద అన్నదానం చేస్తారు. దీనికి సంబంధించి తిరుపతి దేవస్థాన పరిసరాల్లో డిస్ ప్లే బోర్డులు కూడా పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం అన్నదానం చేయాలని ఆలోచన ఉన్నవారు ఈ విధమైన ప్రాసెస్ ఫాలో అవ్వండి.

also read:మరో బ్రాండ్ ఆఫర్ కొట్టేసిన సమంత.. సోషల్ మీడియాలో వైరల్

Visitors Are Also Reading