Home » భారీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్.. ఒక కుటుంబంలో ఒకరికి టికెట్..!!

భారీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్.. ఒక కుటుంబంలో ఒకరికి టికెట్..!!

by Sravanthi
Ad

సముద్రంలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చిన్న చెరువులా మారిపోయింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పటికీ ఎంతో క్యాడర్ ఉన్నా నేతల మధ్య సఖ్యత కుదరక ప్రతి ఎన్నికల్లో ఫెయిల్ అవుతూనే వస్తుంది. దీంతో మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా పంజాబ్ లో ఉన్న అధికారాన్ని కూడా కోల్పోయింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రక్షాళన చేయకుంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అనే ఊసు లేకుండా పోతుందని భావించిన అధిష్టానం, కట్టుదిట్టమైన రూల్స్ పెట్టబోతోంది. అవేంటో ఒకసారి చూద్దాం..!! ఇకనుంచి పార్టీ నుంచి వలసలు వెళ్లే నాయకులకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తోంది. నాయకులతో ప్రమాణం కూడా చేయించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ రూల్స్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉంటాయని, రాహుల్ గాంధీ కుటుంబంలో కూడా ఒకరు పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అలాగే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ ఇచ్చే ఫార్ములా కూడా అమలులోకి తీసుకు రానుందని తెలుస్తోంది. అయితే ఈ ఫార్ములా ప్రకారమే వచ్చే ఎన్నికల్లో సోనియాగాంధీ ఎన్నికల్లో పోటీ చేయబోనని రాహుల్ మంది మాత్రమే బరిలోకి దిగవచ్చు అనే విషయాలు జోరందుకున్నాయి. అంతేకాకుండా g23 ప్రభావం చూపే నాయకులను కూడా విచారించాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ విధానం ప్రకారం హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపెందర్ సింగ్ కు రైతు వ్యవహారాల కమిటీ కమాండ్ అప్పగించారు. అలాగే రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడైన దళిత నేత ఉదయభానును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అయితే ఈసారి దళిత ఓబీసీ మైనారిటీ నాయకులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ తీర్మానం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ కోసం నాయకులు ఉద్యమించాలని సూచనలు చేశారు. పార్టీ మనందరికీ ఎంతో ఇచ్చిందని, దానికి ఇప్పుడు చెల్లించే సమయం వచ్చిందని సోనియా అన్నారు. దేశం మొత్తం 400 మంది నేతలు చింతల్ శివారులో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఈ శిబిరానికి రాహుల్ గాంధీ ఉదయపూర్ నుంచి రైలులో బయలుదేరనున్నారని ఆయన వెంట పలువురు నేతలు కూడా రానున్నారని తెలుస్తోంది.

Advertisement

ALSO READ;

Advertisement

వాకింగ్ చేస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి.. గుర్తుంచుకోండి..!!

చనిపోయిన పది రోజుల్లోపు కర్మకాండ చేయకుంటే వారి ఆత్మలు చెట్లపైన ఉంటాయా..!!

 

 

Visitors Are Also Reading