Home » చనిపోయిన పది రోజుల్లోపు కర్మకాండ చేయకుంటే వారి ఆత్మలు చెట్లపైన ఉంటాయా..!!

చనిపోయిన పది రోజుల్లోపు కర్మకాండ చేయకుంటే వారి ఆత్మలు చెట్లపైన ఉంటాయా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మనిషి మరణించాక జరిగే పరిణామాల గురించి గరుడ పురాణంలో వివరించారు. మనిషి మృతిచెందే కొన్ని సెకండ్ల ముందుగానే సృష్టి అంతా కనిపిస్తుందని, ఆ టైం లో వచ్చిన దివ్యదృష్టితో అతడు ప్రపంచాన్నంతటినీ అర్థం చేసుకుంటాడని,కానీ ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంటారని గరుడ పురాణంలో వివరించారు. ఈ సమయంలో యమదూతలు కూడా చేరుకుంటారని, వారి భయానక రూపాన్ని చూసిన వెంటనే చనిపోయే మనిషి నోటినుంచి నురగలు కారుస్తూ దుస్తుల్లోనే మూత్రవిసర్జన చేస్తారని దీని అనంతరం నవనాడులు మూసుకుపోయి చివరికి ప్రాణం పోతుందట. తర్వాత వారి ఆత్మ ను యమభటులు నరకానికి తీసుకొని వెళ్తారట. దీన్ని తీసుకెళ్లడానికి సుమారు 45 రోజుల సమయం పడుతుందని ఈ సందర్భంలో ఆత్మలను యమదూతలు చాలా చిత్రహింసలకు గురి చేస్తారని పురాణంలో తెలియజేశారు. ఒకవేళ వారి రూపాన్ని చూసి ఆత్మలు భయపడినా వారి చేతిలో ఉన్న ఆయుధాలతో దాడి చేస్తూ ఉంటారు. వారు నరకానికి తీసుకుపోయే క్రమంలో శిక్షల గురించి యమదూతలు కథలుకథలుగా చెబుతారట. దీంతో ఆత్మలు భయపడి మమ్మల్ని అక్కడ తీసుకుపోవద్దని వేడుకుంటాయి. ఇలా చేస్తే కనికరించడం పక్కనబెడితే ఇంకాస్త కఠినంగా వ్యవహరించి నరకంలోని యమధర్మరాజు ముందు ప్రవేశ పెడతారట. అయితే అక్కడికి వెళ్ళాక వారు చేసిన పాప పుణ్యాల ప్రకారం వారి శిక్షలను ఖరారు చేస్తారని, చిన్న చిన్న తప్పులు ఉంటే దేవున్ని ప్రార్థిస్తే పాపాల కింద పరిగణించాలని అంటున్నారు. అయితే దొంగతనాలు, హత్యలు లాంటి నేరాలకు పాల్పడితే మాత్రం తప్పనిసరిగా శిక్ష పడుతుందని, అలాగే అబద్దాన్ని కూడా పాపం గానే పరిగణిస్తారట. అయితే ఈ పాపపుణ్యాలను లెక్కించడం కొరకు యమధర్మరాజు ఆత్మను మళ్ళీ భూలోకానికి పంపుతారు. ఈ సందర్భంలో ఆత్మ తాలూకా బంధువులు హిందూ ధర్మం ప్రకారం కర్మకాండలు, పిండప్రదానాలు చేయాలి. వీటిని వారు చనిపోయిన పది రోజుల్లోపు పూర్తి చేయాలి. లేదంటే మళ్లీ వచ్చి ఆత్మలు చెట్లపైన తిరుగుతాయట. ఇదంతా మీకు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా గరుడ పురాణంలో ఇది పేర్కొన్నారు. అందుకే ఎవరైనా మరణిస్తే ఆ తర్వాత 12 రోజుల వరకు గరుడ పురాణాన్ని చదువుతుంటారు. ఇలా చదవడం వల్ల పాపాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతుంటారు.( గమనిక: అయితే చనిపోయిన వారి ఆత్మల గురించి ఇంకా అనేక కథలు ఉన్నాయి. గరుడ పురాణం ప్రకారం చెప్పిన కథ ఇది )

Advertisement

ALSO READ;

Advertisement

మెగా అభిమానుల‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన ఉపాస‌న‌..!

మే నెల‌లో విడుద‌లైన మ‌హేష్ బాబు సినిమాలు ఇవే..!

 

 

 

Visitors Are Also Reading