సోషల్ మీడియాలో తనపై, జగ్గారెడ్డిపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ.హనుమంతరావు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనను వీహెచ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తో జగ్గారెడ్డి తాను ఉన్న ఫొటోను మార్ఫింగ్ చేసి కొందరు లో పోస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదంతా కావాలనే చేసే అసత్య ప్రచారం అని తన పొలిటికల్ కెరీర్‌ను దెబ్బతీసేందుకు ఇదంతా జరుగుతుందని పేర్కొన్నారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్‌తోనే ఉన్నానని, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ జరుగుతున్న అసత్య ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ కోరారు.
Also Read : ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న హీరోలతో నటించిన ముద్దుగుమ్మలు వీరే…!
Advertisement
Advertisement
ఇదిలా ఉండగా.. తాను ఫిర్యాదు చేస్తుంటే ఎందుకు తీసుకోవడం లేదని వీహెచ్ రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేసన్‌లో వాగ్వాదానికి దిగిన విషయం విధితమే. ఇన్‌స్పెక్టర్, వీహెచ్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తాను ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్యలో కేసీఆర్ ఉన్న ఫొటోను మార్ఫింగ్ చేసి కొందరూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసినదే.
మరొక వైపు తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ఆయనను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఏకంగా ఇంటికి వెళ్లి జగ్గారెడ్డితో మాట్లాడారు. రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన జగ్గారెడ్డి పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలు వైరలయ్యాయి.
Also Read : మేకపాటి గౌతమ్‌రెడ్డి సక్సెస్ గురించి మీకు తెలుసా..?