Home » రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయలు ఇవ్వబోతున్న కాంగ్రెస్.. ఎప్పుడంటే..?

రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయలు ఇవ్వబోతున్న కాంగ్రెస్.. ఎప్పుడంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ సిప్లిగంజ్. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన పాడిన పాటకు గాను ఆస్కార్ అవార్డు వరించింది. దీంతో రాహుల్ పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోయింది. అలాంటి ఆయన టాలెంట్ ను గుర్తించిన కాంగ్రెస్ రూ. 10 లక్షల నజరానా ప్రకటించారు. కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్ ఈ చెక్ అందించారు. అంతేకాకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ కు కోటి రూపాయల బహుమతి అందిస్తామని ఆఫర్ ఇచ్చారు.

also read:నేరేడు పండ్లు తింటున్నారా.. అయితే నీళ్లు అస్సలు తాగకండి.. ఏమవుతుందంటే..?

Advertisement

ఇదిలా ఉండగా నేడు సికింద్రాబాద్లోని బోయిన్ పల్లి లో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డితో పాటుగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ యువతలో మేధోసంపత్తిని బయటకు తీసుకురావడానికి ఏర్పాటు చేశామని అన్నారు.

Advertisement

also read:రుద్రాక్షను ధరించేవాళ్లు పాటించాల్సిన నియమాలు.. లేదంటే అనర్ధమే..!!

ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాహుల్ సిప్లిగంజ్ రావడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్విజ్ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేసే రోజు ప్రియాంక గాంధీని ఆహ్వానించి రాహుల్ కు సన్మానం చేస్తామని అన్నారు. యూత్ డిక్లరేషన్ కు కొనసాగింపుగానే ఈ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తామని, జూన్ 2 న రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ఉంటుందని తెలియజేశారు రేవంత్ రెడ్డి.

also read:

Visitors Are Also Reading