Home » బియ్యం పురుగులు పడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. బెస్ట్ ఇంటి చిట్కాలు..!!

బియ్యం పురుగులు పడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. బెస్ట్ ఇంటి చిట్కాలు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుత కాలంలో చాలామంది మనం ప్రతిరోజు తినే బియ్యాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి విలువ చేసుకుంటారు. ఇలాంటి సమయంలో బియ్యానికి పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.అవేంటో చూద్దాం..

also read:నాగ చైతన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ?

Advertisement

ముఖ్యంగా బియ్యాన్ని తడిచేతులతో ముట్టుకుంటే పురుగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తడిచేతులతో ఎప్పుడు బియ్యాన్ని ముట్టుకోరాదు. బియ్యం డబ్బాలో నాలుగు లేదా ఐదు బిర్యాని ఆకులను వేయాలి. బిర్యానీ ఆకుల వాసన పురుగులు, కీటకాలకు నచ్చదు. అందువల్ల బియ్యం లోకి పురుగులు,కీటకాలు రాకుండా తాజాగా ఉంటాయి.

Advertisement

బియ్యం డబ్బాలో 10 నుంచి 15 లవంగాలను కలపాలి. ఈ లవంగాల వాసన కు కీటకాలు, క్రీములు ప్రవేశించవు. వెల్లుల్లి వాసనను పురుగులు కీటకాలు ఇష్టపడవు కాబట్టి వెల్లుల్లి రెబ్బలను అందులో వేయవచ్చు. బియ్యాన్ని ఫ్రిజ్లో ఉంచితే పురుగులు రావు. అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా బియ్యాన్ని ఎండలో ఆరబెట్టాలి. దీని వల్ల కూడా పురుగులు రావు. ఈ చిట్కాలు కేవలం బియ్యానికే కాదు పప్పులకు కూడా ఉపయోగపడతాయి.

also read:పూరిని వీడని “లైగర్” చిక్కులు.. ఫిల్మ్‌చాంబర్‌ ఎదుట ఎగ్జిబిటర్ల ఆందోళన

Visitors Are Also Reading