Home » యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ పై హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు.. దీనిపై హీరో ఏమ‌న్నాడంటే..?

యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ పై హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు.. దీనిపై హీరో ఏమ‌న్నాడంటే..?

by Anji
Ad

టాలీవుడ్ లో వెరైటీ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన‌టువంటి న‌టుడు విశ్వ‌క్‌సేన్ హీరో తాజాగా అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణంతో సంద‌డి చేయ‌నున్నారు. హీరో విశ్వ‌క్ సేన్‌పై అడ్వ‌కేట్ అరుణ్‌కుమార్ హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేసాడు. పెట్రోల్ డ‌బ్బాతో నిన్న ఓ అభిమాని సూసైడ్ చేసుకునే విధంగా ప్రాంక్ వీడియో చేసిన విశ్వ‌క్‌సేన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేశాడు.

Advertisement

అయితే బ‌హిరంగ ప్ర‌దేశాల్లో సినిమా ప్ర‌మోష‌న్‌లు చేయ‌వ‌ద్ద‌ని.. పోలీసుల‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని కోరాడు. అడ్వ‌కేట్ అరుణ్‌కుమార్ ఫిర్యాదును హెచ్ఆర్సీ స్వీక‌రించింది. ఇక హీరో విశ్వ‌క్‌సేన్ న‌టించిన తాజా చిత్రం అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం అనే సినిమా మే 06న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం చిత్ర యూనిట్ చేసిన ప్రాంక్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement


మ‌రొక‌వైపు హీరో విశ్వ‌క్‌సేన్ స్పందిస్తూ.. కేసులు పెడితే భ‌య‌ప‌డ‌మ‌ని.. ప్రాంక్ వీడియోలు చేస్తే త‌ప్పేంటి అని ప్ర‌శ్నించారు. డ‌బ్బాలో ఉన్న‌ది పెట్రోల్ కాదు.. అది వాట‌ర్‌. అక్క‌డ అస‌లు ప‌బ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసే విదంగా మేము వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని వెల్ల‌డించారు. అక్క‌డ ఉన్నది మా టీమ్ మాత్ర‌మే. చుట్టు ప‌క్క‌ల ఉన్న వాళ్లు స‌ర‌దాగా తీసుకున్నార‌ని స్ప‌ష్టం చేశారు. ప్రాంక్ వీడియోలు చేసే వాళ్లంద‌రిపై అడ్వ‌కేట్ కేసులు పెడుతా అన‌డం క‌రెక్ట్ కాదు అని విశ్వ‌క్‌సేన్ మండిప‌డ్డారు.

Also Read : 

న‌డిరోడ్డుపై విశ్వ‌క్ సేన్ ర‌చ్చ‌.. కేసు న‌మోదు చేయాలంటున్న నెటిజ‌న్లు..!

“ఫేక్ బాడీ” అంటూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటో పై దారుణమైన ట్రోల్స్…!

Visitors Are Also Reading