Home » “ఫేక్ బాడీ” అంటూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటో పై దారుణమైన ట్రోల్స్…!

“ఫేక్ బాడీ” అంటూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటో పై దారుణమైన ట్రోల్స్…!

by AJAY
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ నటించిన తీరు ప్రతి ఒక్కరి చేత ప్రశంసలు కురిపిస్తోంది.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ ఫోటో ను ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ డబ్బు రథాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో రెండు చేతులు పైకెత్తి తన బాడీని చూపిస్తున్నారు. అయితే ఈ ఫోటో పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇది ఫేక్ ఫోటో అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

అంతేకాకుండా కొంతమంది ఎన్టీఆర్ లావుగా ఉన్నాడు అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఓ నెటిజన్ ఎన్టీఆర్ ఫోటో కు “సూపర్ ఎడిటింగ్ బ్రో ” అంటూ కామెంట్ పెట్టాడు. మరో నెటిజన్ “ఈ క్రెడిట్ మొత్తం పిక్స్ ఆర్ట్ కు చెందుతుంది” అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ ఈ ఫోటో అరవింద సమేత సినిమా సమయంలోదని… ఫోటోషాప్ చేయాల్సిన అవసరం ఎన్టీఆర్ కు ఏముందని కామెంట్ చేశాడు.

అంతేకాకుండా ఎన్టీఆర్ గతంలో చేసిన సినిమాల గురించి కూడా తెలుసుకోవాలని కామెంట్ పెట్టాడు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ తన తర్వాత సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తారని… భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని కొరటాల తన రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు.

Also read :

“ఆ” అక్షరం తో మెగాస్టార్ సినిమా చేస్తే ఫ్లాపేనా…?

ఆచార్య ఫ్లాప్ అవుతుంద‌ని షూటింగ్‌లోనే చిరు చెప్పారా..? కొర‌టాల ఏమ‌న్నాడంటే..?

Visitors Are Also Reading