Home » న‌డిరోడ్డుపై విశ్వ‌క్ సేన్ ర‌చ్చ‌.. కేసు న‌మోదు చేయాలంటున్న నెటిజ‌న్లు..!

న‌డిరోడ్డుపై విశ్వ‌క్ సేన్ ర‌చ్చ‌.. కేసు న‌మోదు చేయాలంటున్న నెటిజ‌న్లు..!

by Anji
Ad

విల‌క్ష‌ణ‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వెరైటీ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను దగ్గ‌రైన‌టువంటి న‌టుడు విశ్వ‌క్ సేన్ హీరో తాజాగా అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణంతో సంద‌డి చేయ‌బోతున్నాడు. విద్యాసాగ‌ర్ చింతా దర్వ‌క‌త్వంలో తెర‌కెక్కించిన ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్స్ జోరుగా కొన‌సాగుతున్నాయి. మాస్ కా దాస్ అని మొన్న‌టి వ‌ర‌కు అనిపించుకున్న ఇప్పుడు క్లాస్ సినిమాల‌తో కూడా జ‌నాల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ఈ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్‌. ఇక అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం అనే సినిమా మే 06 ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. ఈ సినిమా ప్ర‌మోషన్ల‌లో భాగంగా బిజీగా ఉన్నాడు. న‌డిరోడ్డుపై ఓ యువ‌కునితో క‌లిసి ఫ్రాంక్ అంటూ ర‌చ్చ చేసాడు విశ్వ‌క్ సేన్‌.


ప్రాంక్ వీడియో కోసం ఓ యువ‌కుడిని తీసుకొచ్చాడు. కొత్త సినిమాలు విడుద‌ల‌యిన‌ప్పుడు ఐమాక్స్ థియేట‌ర్ వ‌ద్ద రివ్యూలు అంటూ మైక్ క‌న‌ప‌డితే ఓవ‌ర్ యాక్టింగ్ చేసే ఓ యువ‌కుడిని సినిమా ప్ర‌మోష‌న్ కోసం తీసుకొచ్చారు. విశ్వ‌క్‌సేన్ ఫిలింన‌గ‌ర్ రోడ్డులో వెళ్తుంటే ఆ యువ‌కుడు కారుకు అడ్డంగా ప‌డుకొని న‌డిరోడ్డుపై న్యూసెన్స్ చేసాడు. విశ్వ‌క్ కారులోంచి దిగి వ‌చ్చి అడిగితే అల్లం అర్జున్ కుమార్ 33 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి కాలేదు క‌దా సార్‌.. నేను త‌ట్టుకోలేక‌పోతున్నాను. అందుకే పెట్రోల్ పోసుకుంటా అని హ‌ల్ చ‌ల్ చేశాడు. విశ్వ‌క్ సేన్ కూడా ఇది అంతా త‌న‌కు ఏమి తెలియ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించాడు.

Advertisement

Advertisement

కొద్ది సేప‌టి వ‌ర‌కు న‌డిరోడ్డుపై వీరిద్ద‌రూ క‌లిసి హంగామా చేసి ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించారు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో ప్ర‌మోట్ చేయ‌గా ఇది వాళ్లంద‌రూ ప్ర‌మోష‌న్స్ కోసం మ‌రీ ఇంత నీచంగా చేయాలా..? ప‌్ర‌మోష‌న్స్ పేరుతో ప‌బ్లిక్ ప్లేస్‌లో ప్రాంక్ అంటూ ఈ న్యూసెన్స్ ఏమిటి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు. మ‌రొక‌వైపు సినిమా ప్ర‌మోష‌న్‌ల కోసం న‌డి రోడ్డుపై ప్రాంక్ చేసి ప‌బ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు విశ్వ‌క్‌సేన్‌, మూవీ రివ్యూవ‌ర్ ల‌క్ష్మ‌ణ్‌పై కేసు పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వారిపై ఐపీసీ 268 కింద కేసు న‌మోదు చేయాల‌ని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు.

Also Read : 

ఆచార్య ఫ్లాప్ అవుతుంద‌ని షూటింగ్‌లోనే చిరు చెప్పారా..? కొర‌టాల ఏమ‌న్నాడంటే..?

వామ్మో ఇదెక్క‌డి అగ్రిమెంట్‌.. దంప‌తుల మ‌ధ్య ఇలాంటి ఒప్పందాన్ని ఎవ‌రైనా చూశారా..?

Visitors Are Also Reading