Home » అవకాశాలు రాక..తిండిలేక.. చచ్చిపోదాం అనుకున్న.. రాజేంద్రప్రసాద్ ఫ్లాష్ బ్యాక్ పై ఓ లుక్కేయండి..?

అవకాశాలు రాక..తిండిలేక.. చచ్చిపోదాం అనుకున్న.. రాజేంద్రప్రసాద్ ఫ్లాష్ బ్యాక్ పై ఓ లుక్కేయండి..?

by Sravanthi
Ad

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్. దాదాపు పాతిక సంవత్సరాల పాటు హీరోగా తెలుగు ప్రేక్షకులను నవ్వించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. రాజేంద్రప్రసాద్ అంటే కేవలం నవ్వు మాత్రమే కాకుండా నవరసాలను అద్భుతంగా ప్రదర్శించగల పరిపూర్ణ నటుడు కూడా. హీరో అవకాశాలు తగ్గినా కూడా సహాయనటుడిగా రకరకాల పాత్రలను పోషిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కానీ ఆయన సినీ ఇండస్ట్రీలో అంత సులువుగా మాత్రం స్థిరపడలేదు.

ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రభావంతో ఆయనకు నటనపై ఆసక్తి పెరిగింది. మిమిక్రీలు చేస్తూ సీనియర్ ఎన్టీఆర్ ను తలపించే వారు. చివరికి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి గోల్డ్ మెడల్ సాధించారు. అయినా ఆయనకు సినిమా అవకాశాలు లభించలేదు అని చెప్పవచ్చు. దీంతో ఆకలి పస్తులతో చాలాకాలం చెన్నైలోనే కాలం వెళ్లదిశారు. చివరికి ఓపిక నశించడంతో చావు తప్ప మరో మార్గం లేదని భావించారట ఆయన. ఈ సమయంలోనే ఒక అవకాశం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.

Advertisement

Advertisement

రాజేంద్రప్రసాద్ కి దగ్గర బంధువు అయిన సినీ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్యను కలిశారు. ఆ సమయంలో ఆయన ఎన్టీఆర్ తో మేలుకొలుపు మూవీ తీసుకున్నారు. ఇక ఆ చిత్రంలోని ఒక తమిళ నటుడు తరుపున డబ్బింగ్ చెప్పించారు ఆయన. దీంతో కొన్నాళ్లపాటు డబ్బింగు చెబుతూనే ఎప్పటిలాగా మళ్లీ అవకాశాల కోసం పరితపించారు. అలా బాపు దర్శకత్వంలో వచ్చిన స్నేహం సినిమాలో చిన్న పాత్ర దక్కింది రాజేంద్రప్రసాద్ కు.

  అలా రాజేంద్ర ప్రసాద్ తొలిసారి నటించిన సినిమా 1977 సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైంది. ఆ తర్వాత ఛాయా, నిజం,మూడుముళ్ల బంధం, రామరాజ్యంలో భీమరాజు, పోరాటం, ఈ చదువులు మాకొద్దు, రోజులు మారాయి,వందేమాతరం వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు ప్రసాద్. ఆయన అలాగే ప్రేమించు పెళ్ళాడు అనే సినిమాలో మొదటిసారి హీరోగా నటించారు. కెరియర్ ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి, సుమన్, భానుచందర్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నా రాజేంద్ర ప్రసాద్ “ప్రేమించు పెళ్ళాడు” సినిమాలో పూర్తి స్థాయి హీరోగా మారాడు.

also read;

సిల్క్ స్మిత చనిపోయేముందు రాత్రి కాల్ చేసి చెప్పింది ఏంటంటే.. బయటకు వచ్చిన సంచలన విషయాలు..!!

పచ్చని కాపురంలో మామిడికాయ చిచ్చు.. మహిళ ప్రాణం బలి.. కారణం తెలిస్తే తిట్టుకుంటారు..?

 

Visitors Are Also Reading