Home » సిల్క్ స్మిత చనిపోయేముందు రాత్రి కాల్ చేసి చెప్పింది ఏంటంటే.. బయటకు వచ్చిన సంచలన విషయాలు..!!

సిల్క్ స్మిత చనిపోయేముందు రాత్రి కాల్ చేసి చెప్పింది ఏంటంటే.. బయటకు వచ్చిన సంచలన విషయాలు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఐటెం భామ అంటేనే సిల్క్ స్మిత గుర్తొస్తుంది. ఆమె తన ఐటమ్ సాంగ్ తో ఎంతో పేరును సంపాదించుకొని అభిమానుల ఆదరాభిమానాలు పొందింది. సినీ ఇండస్ట్రీలో ఎంత పేరును సంపాదించిందో, అంత దారుణంగా ఆమె జీవితం పతనమైంది. చివరికి ఆమె చనిపోయాక బాడీ పై ఈగలు వాలి దారుణమైన పరిస్థితుల్లో మరణించింది.. ఆమె మరణం గురించి సంచలన విషయాలు బయటపెట్టిన ఆమె స్నేహితురాలు అనురాధ.. మరి ఏం చెప్పింది ఒకసారి చూద్దామా..?

సిల్క్ స్మిత నేను మంచి స్నేహితులం అని కానీ ఆమె ఎప్పుడూ కూడా పర్సనల్ విషయాలను మాతో అస్సలు పంచుకునేది కాదు. మనం ఎవరితో అయితే దగ్గరగా అవుతాము వారిని మన వారిలా భావించి మన విషయాలు బాధలు అన్ని చెప్పుకుంటాం. కానీ సిల్క్ స్మిత కాదు మాత్రం అలా కాదని వెటరన్ యాక్టర్ అనురాధ సంచలన విషయాలు బయట పెట్టారు. సిల్క్ స్మిత చనిపోవడానికి ముందు రోజు కాల్ చేసి ఆమెని ఇంటికి రమ్మని పిలిచిందట. కానీ అనురాధ మాత్రం ఇప్పుడు అర్జెంట అని అడిగి, రేపు ఉదయం పిల్లల్ని స్కూల్లో వదిలేసి వస్తానని చెప్పిందట.

Advertisement

Advertisement

దీంతో స్మిత నువ్వు ఇప్పుడు రాలేవా అని అడుగుతూనే మళ్లీ మార్నింగ్ తప్పకుండా రావాలని చెప్పిందట. కానీ అనురాధ ఇప్పుడు అర్జెంట్ అయితే చెప్పు వస్తాను అని అనడంతో స్మిత రేపు ఉదయం తప్పకుండా రమ్మని చెప్పిందట. ఆ మరుసటి రోజే సిల్క్ స్మిత మరణం గురించి వార్తలు వస్తున్నాయి. వెంటనే చూసిన అనురాధ షాక్ అయిపోయిందట. అయ్యో నన్ను రమ్మని పిలిచిందే ఇప్పుడే ఇలా చేసుకుంది ఏంటని చాలా బాధపడ్డాను అని చెప్పింది. ఒకవేళ వెళ్లి ఉంటే మాత్రం నాకు ఏం చెప్పి ఉండేదో అలా చేసుకునేది కాదు కావచ్చు అని బాధ పడిందట.

వెంటనే ఇంటికి వెళ్ళింది. కానీ అప్పటికే సిల్క్ ఫిదా బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. దీంతో అనురాధ మరియు శ్రీ విద్యా కలిసి హాస్పిటల్ కి వెళ్లి చూసేసరికి సిల్క్ స్మితను ఒక నార్మల్ స్ట్రక్చర్ పై అలా పడేసి ఉంచారని మొత్తం ఈగలు వాలుతున్నాయని వెంటనే ఆవిడను చూసినా శ్రీవిద్య అనురాధ చాలా బాధ పడుతూ ఆమె బాడీ అంటే ఎంతోమందికీ క్రేజ్ ఉన్న ఆర్టిస్టు చివరికి చనిపోయిన తర్వాత ఇంత దారుణంగా మారిపోయిందని బాధపడ్డామని తెలియజేసింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఆమె టైమింగ్ కోసం పెద్ద పెద్ద దర్శకులు, హీరోలు వెయిట్ చేసే వారని, చివరికి ఆమె దారుణమైన ఈ పరిస్థితుల్లో చనిపోయిందని చెప్పుకొచ్చారు యాక్టర్ అనురాధ.

also read;

1985 నంద్యాల సభలో సూపర్ స్టార్ కృష సభ జరిగితే ఆయన పై ఎందుకు చెప్పులు, రాళ్ల దాడి జరిగింది..?

పచ్చని కాపురంలో మామిడికాయ చిచ్చు.. మహిళ ప్రాణం బలి.. కారణం తెలిస్తే తిట్టుకుంటారు..?

 

Visitors Are Also Reading