Home » పచ్చని కాపురంలో మామిడికాయ చిచ్చు.. మహిళ ప్రాణం బలి.. కారణం తెలిస్తే తిట్టుకుంటారు..?

పచ్చని కాపురంలో మామిడికాయ చిచ్చు.. మహిళ ప్రాణం బలి.. కారణం తెలిస్తే తిట్టుకుంటారు..?

by Sravanthi Pandrala Pandrala

కొంతమంది తెలిసీ తెలియక క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు చివరికి ప్రాణాల మీదకు తెస్తాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. మామిడికాయ పచ్చడి కోసం కిరోసిన్ మంటల్లో కాలింది. చివరికి ప్రాణాలు పోగొట్టుకుని అందరితో విమర్శల పాలయింది. మరి ఆ మహిళ ప్రాణాలు ఎందుకు తీసుకుంది.. ఏం జరిగింది ఓ సారి చూద్దాం..?పచ్చని కాపురంలో పచ్చని మామిడికాయ చిచ్చుపెట్టి చివరికి ప్రాణాలు తీసింది. ఆలోచన లేని పనులతో ఇలాంటి పరిణామాలు దేశంలో అనేకం జరుగుతున్నాయి.

చిన్నచిన్న గొడవలకు తీవ్రంగా ఆవేదన చెంది కఠిన నిర్ణయాలు తీసుకొని గాల్లో పెట్టిన దీపంలా అరిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కరీంనగర్ జిల్లాలోని ఇరుకు తిరుపతి, సాయి ప్రియ భార్య భర్తలు. విరు గురువారం రోజున మామిడికాయ పచ్చడి పెట్టే విషయంలో చిన్న గొడవ ఏర్పడింది. అది కాస్తా చిలికిచిలికి గాలివానలా మారి తుఫానులా వారి కాపురాన్ని చిదిమేసింది. వివాహం జరిగి కొద్ది సంవత్సరాలు అవుతున్నా వీరి పచ్చని జీవితంలో మామిడికాయ పచ్చడి యముడిలా మారింది. భార్యాభర్తల మధ్య మాటలు పెరిగాయి.

తన భర్త ఎదురు చెప్పాడనే చిన్న కారణంతో రగిలిపోయిన సాయిప్రియ వంటగదిలోకి వెళ్లి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అక్కడే ఉన్న భర్త తిరుపతి, మరియు తోటి కోడలు కాపాడే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయింది. ఆ ప్రయత్నంలో వారిద్దరి శరీరాలు కూడా కాస్త కాలిపోయాయి. దీంతో మీరు చూస్తుండగానే సాయి ప్రియ శరీరం మంటల్లో కాలింది. తీవ్రగాయాలతో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

కానీ అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లండని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్తున్న తరుణంలో మార్గమధ్యంలో సాయి ప్రియ ప్రాణాలు విడిచింది. భర్త చిన్న మాట అన్నాడని ఆవేశంలో సాయి ప్రియ తన నూరేళ్ళ కాపురాన్ని చేతులారా బుగ్గిపాలు చేసుకుందని వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి రామడుగు ఎస్ఐ సాంబమూర్తి ఈ విషయాలను బయటపెట్టారు.

also read;

ప్ర‌పంచ వ్యాప్తంగా మంకీపాక్స్ క‌ల‌క‌లం..డ‌బ్ల్యూహెచ్ఓ ఏమంటుందంటే..?

మూడేళ్లు దాటితే ప్రామిస‌రీ నోటు చెల్ల‌దా…? ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే అంతే సంగ‌తి..!

 

 

Visitors Are Also Reading