Home » గుమ్మ‌డి త‌న కూతురు వివాహానికి రావాల‌ని పిలుస్తే ఎన్టీఆర్ ఎందుకు వెళ్ల‌లేదు..? ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన కోల్డ్ వార్ ఏంటి..?

గుమ్మ‌డి త‌న కూతురు వివాహానికి రావాల‌ని పిలుస్తే ఎన్టీఆర్ ఎందుకు వెళ్ల‌లేదు..? ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన కోల్డ్ వార్ ఏంటి..?

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో విలక్షణ నటులుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా ఒకరు. గుమ్మడి 500కు పైగా సినిమాలలో నటించి గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా తండ్రి పాత్రలకు పెట్టింది పేరుగా గుమ్మడి మారిపోయారు. తెలుగుతోపాటు తమిళ సినిమాలలో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. తన నటనకు గాను గుమ్మడి రాష్ట్రపతి అవార్డును సైతం ద‌క్కించుకున్నారు. సినిమాల విషయానికి వస్తే గుమ్మడి ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా సిద్ధపడేవారు.

 

Advertisement

తనకంటే వయసులో పెద్దవాళ్ళైన నటులకు కూడా తండ్రిగా, భర్తగా నటించిన రోజులు కూడా ఉన్నాయి. గుమ్మడి వెంకటేశ్వరరావు అర్ధాంగి సినిమాలో నటించారు. ఈ సినిమాలో గుమ్మ‌డికి భార్యగా నటించిన శాంత కుమారి వయసు ఆయన కంటే 8 సంవత్సరాలు పెద్ద కావడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాలో గుమ్మడి కి పెద్ద కుమారుడిగా అక్కినేని నాగేశ్వరరావు నటించాడు. కాగా గుమ్మడి కంటే నాగేశ్వ‌ర‌రావు మూడు సంవత్సరాలు పెద్దవాడు.

Advertisement

మరోవైపు గుమ్మడి కి చిన్న‌ కొడుకుగా నటించిన జగ్గయ్య వయసు కూడా ఆయన కంటే ఒక సంవత్సరం పెద్దది. ఇదిలా ఉంటే అప్పట్లో ఎన్టీఆర్ గుమ్మడి మధ్య కోల్డ్ జరిగిందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం… మొద‌టిసారి ఒక హోటల్ లో గుమ్మడి కి ఎన్టీఆర్ కు మధ్య పరిచయం ఏర్పడింది. అలా ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. దాంతో ఎన్టీఆర్ తన సినిమాలో పిలిచి మరీ గుమ్మడి కి అవకాశాలు ఇప్పించారు.

అయితే ఒకానొక సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. గుమ్మడి ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు సినిమాలలో నటించడంతో ఎన్టీఆర్ గుమ్మడిని అక్కినేని మనిషిగా భావించారు. దాంతో ఆయనను దూరం పెట్టారు. అంతేకాకుండా గుమ్మడి వెంకటేశ్వరరావు తన కుమార్తె వివాహానికి తప్పకుండా రావాలని ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి శుభలేఖను కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఎన్టీఆర్ ఆ పెళ్లికి హాజరవ్వలేదు. అయితే అక్కినేని ఎన్టీఆర్ కలిసిపోయిన తర్వాత గుమ్మడిని దూరం పెట్టినందుకు ఎన్టీఆర్ బాధపడ్డారట.

ALSO READ : తండ్రి మీద ఉన్న ప్రేమతో బాలకృష్ణ రోజు చేసే పని ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Visitors Are Also Reading