Telugu News » Blog » తండ్రి మీద ఉన్న ప్రేమతో బాలకృష్ణ రోజు చేసే పని ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

తండ్రి మీద ఉన్న ప్రేమతో బాలకృష్ణ రోజు చేసే పని ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ. చిన్నతనం నుంచే సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ సినిమాల్లో సహాయక పాత్రలు నటించిన బాలయ్య, తర్వాత తండ్రి దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి తన క్రేజ్ ను కాపాడుకుంటూ ఆరు పదుల వయసులో కూడా ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న ఆయన సినిమాల్లో దూసుకుపోవడం చూస్తుంటే బాలయ్య అంటే ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Advertisement

అంత వయసు వచ్చినా ఆయన సినిమాలకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి ఆయన సినిమాలు. ఇంతటి టాలెంట్ ఉన్న బాలయ్యకు తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే అమితమైన ప్రేమ. తను నటించిన ప్రతి సినిమాలను ఆయన చూశానని చాలా సందర్భాల్లో వెల్లడించారు. ఆయన తండ్రి వారసత్వంగా వచ్చిన చాలా సేవా కార్యక్రమాలు ఇప్పటికే ఆయన కొనసాగిస్తూ వస్తున్నారు. పెద్దలను గౌరవించడం లో బాలకృష్ణకు సాటి ఎవరూ రారు.

అలాంటి బాలయ్య గురించి నిర్మాత మురళీమోహన్ ఒక సందర్భంలో ఇలా మాట్లాడారు. బాలయ్య తనతో ఎప్పుడూ కలిసి మాట్లాడిన తండ్రి గురించి కచ్చితంగా ప్రస్తావిస్తారని, కనీసం ఆయన ఒక రోజులో వందసార్లైనా గుర్తు చేసుకుంటారని మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. తండ్రిని అంతగా ఆరాధించే బాలకృష్ణ తన తండ్రి మీద ఉండే ప్రేమను చాటుకునే సందర్భం ఏదైనా సరే వదులుకోరు అని వెల్లడించారు.

Advertisement

ALSO READ:

You may also like