Home » అప్పుడు బాబాయ్, ఇప్పుడు చెల్లి అంటూ షర్మిల మీద జగన్ మాస్ కౌంటర్ !

అప్పుడు బాబాయ్, ఇప్పుడు చెల్లి అంటూ షర్మిల మీద జగన్ మాస్ కౌంటర్ !

by Anji
Published: Last Updated on
Ad

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తిరుపతి ఇండియా టుడే సదస్సులో పాల్గొని సంచనల కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తమ సోదరిని ప్రయోగించిందని చెప్పారు. గతంలో తమ బాబాయి ని మంత్రిగా చేసి తమకు వ్యతిరేకంగా పోటీ చేయించారని.. అలాగే తమ కుటుంబాన్ని కూడా విభజించారని చెప్పారు.

jagan-and-sharmila

Advertisement

 

కాంగ్రెస్  పార్టీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు. కానీ అధికారం అనేది దేవుడు ఇచ్చేది. దేవుడ్ని నేను బలంగా నమ్మతాను. అంతా ఆయనే చూసుకుంటాడని చెప్పారు సీఎం వైఎస్ జగన్. కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతుందని జగన్ అన్నారు. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని చెప్పారు. ఇక బీజేపీకి ఏపీలో బలం లేదని జగన్ అన్నారు. ఏపీ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తన వల్ల ప్రజలకు మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయాలని ధైర్యంగా అడుగుతున్నానని జగన్ చెప్పారు.

Advertisement

ఏపీలోని అన్ని రంగాల్లో పెను మార్పులు తీసుకువచ్చామని జగన్ తెలిపారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని చెప్పారు. తమ ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయతకు నిదర్శనం ఇది అన్నారు. చంద్రబాబు విషయంలో తమకు ప్రతీకారం అన్నది లేనే లేదని జగన్ చెప్పారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరిందని, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్‌ విధించిందని తెలిపారు. అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుందని అడిగారు. సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్‌, బీజేపీ ఉనికి పెద్దగా ఉండదని అన్నారు.

మరిన్ని  తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading