Home » ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ కీలక నిర్ణయం!

ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ కీలక నిర్ణయం!

by Anji
Ad

ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రస్తుత ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ జనసేన పార్టీలు ప్రచారాలను ప్రారంభించాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన చేపట్టి వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. దీనిపై ఈ రోజు మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు.

Advertisement

Advertisement

ఏపీలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయ జెండా ఎగురవేయాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. వైనాట్ 175 నినాదంతో ప్రజల్లోకి గత 5 ఏళ్ళు అదికారంలో ఉండి చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయనున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం మొదలు పెట్టనుంది. ఈ నెల 25న భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ క్రమంలో సభ నిర్వహహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో  సీఎం జగన్ కీలక సమావేశం నిర్శహించారు.

 

ఆంధ్ర ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యం సీఎం జగన్  కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్థానాల్లో టార్గెట్ 175 కి 175 సీట్లను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే ఎంపీ స్థానాల్లో అన్ని స్థానాల్లో వైసీపీ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్ళురుతున్నారు. ఈ క్రమంలో సర్వేలలో గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను మారుస్తున్నారు.

Visitors Are Also Reading