Home » ఏపీలో రూ. 13 లక్షల కోట్లతో పెట్టుబడులు…6 లక్షల మందికి ఉద్యోగాలు : సీఎం జగన్

ఏపీలో రూ. 13 లక్షల కోట్లతో పెట్టుబడులు…6 లక్షల మందికి ఉద్యోగాలు : సీఎం జగన్

by Bunty
Ad

ఏపీలో రూ. 13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. నేడు వైజాగ్ లో మొదలైన జిఐఎస్- 2023లో సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ సబ్మిట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ, భారతదేశంలో కీలకమైన రాష్ట్రం ఏపీ అని, 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చారని తెలిపారు.

READ ALSO : మోహన్ బాబు, విష్ణు లేకుండానే మంచు మనోజ్ పెళ్లి..?

Advertisement

Advertisement

340 పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. వీటితో 6 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని జగన్ తెలిపారు. పెట్టుబడులకే కాదు, ప్రకృతి అందాలకు విశాఖ నగరం నెలవని ప్రశంసించారు. దేశంలో అత్యధిక సముద్రతీర ప్రాంతం ఉందని, 6 ఓడరేవులు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నాయని, సహజ వనరులతో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని జగన్ తెలిపారు.

READ ALSO : సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో… అది చూసిన భార్య ఏం చేసిందంటే?

తొలిరోజు 8.54 లక్షల కోట్లతో పెట్టుబడులకు ఎంవోయూలు నేడు జరుగుతాయని, మిగిలినవి రేపు జరుగుతాయని జగన్ వివరించారు. ఏపీలో రూ. 13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. తద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు.

READ ALSO : చైనాలో 40 కోట్లకు పైగా పెళ్లి కాని ప్రసాద్ లు… కారణం ఇదే!

Visitors Are Also Reading