Home » Citadel : ‘సిటాడేల్’ విడుదల ఖరారు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Citadel : ‘సిటాడేల్’ విడుదల ఖరారు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

by Bunty
Ad

హాలీవుడ్ నటుడు రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ ‘సిటాడేల్’. తాజాగా ఈ సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 28 నుంచి ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సదరు సంస్థ పోస్టర్లు విడుదల చేసింది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది. ఇదే పోస్టర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘గతాన్ని గుర్తు పెట్టుకోండి,

READ ALSO : సూపర్ స్టార్ కృష్ణ.. మ‌హేష్ ఇంట్లో కాకుండా న‌రేష్ ఇంట్లో ఎందుకు ఉండేవాడు ?

Advertisement

భవిష్యత్తును రక్షించుకోండి’ అంటూ ప్రియాంక చోప్రా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు. ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లో సిరీస్ కథను ఏ మాత్రం రివీల్ చేయలేదు. మంచులో, ట్రైన్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో ట్రైలర్ ను నింపేశారు. మిషన్ ఇంపాజిబుల్,

Advertisement

READ ALSO : నీచ్ కమీన్ కుత్తే… KGF పై తెలుగు డైరెక్టర్ దారుణ వ్యాఖ్యలు

జేమ్స్ బాండ్ తరహా స్పై చిత్రాలను తలపించేలా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఏప్రిల్ 28వ తేదీన ‘సిటాడేల్’ మొదటి రెండు ఎపిసోడ్లు స్ట్రీమ్ కానున్నాయి. తర్వాత వారానికో ఎపిసోడ్ చొప్పున మే 26వ తేదీ వరకు స్ట్రీమ్ చేయనున్నారు. ఈ సిరీస్ కు వివిధ దేశాల్లో స్పిన్ ఆఫ్ లను కూడా రూపొందిస్తున్నారు. ఇండియన్ వెర్షన్ ‘సిటాడేల్’ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

Visitors Are Also Reading