Home » “వీర సింహారెడ్డి” ఎవరో నాకు తెలీదు.. విలన్ డైలాగ్ పై ట్రోలింగ్

“వీర సింహారెడ్డి” ఎవరో నాకు తెలీదు.. విలన్ డైలాగ్ పై ట్రోలింగ్

by Bunty
Published: Last Updated on
Ad

నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలుస్తూ పలు రికార్డులు తిరగరాసింది.

Advertisement

సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఫ్యాక్షనిజం, యాక్షన్ అంశాలను మేళవించి ఈ సినిమా రూపొందింది.

READ ALSO : భూమా మౌలిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా… మనోజ్ కంటే ఎక్కువైనా?

ఇందులో వీరసింహారెడ్డి అనే రాయలసీమ లీడర్ గా జై అనే యువకుడిగా డ్యూయల్ రోల్ లో బాలకృష్ణ నటించాడు. అయితే ఈ వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా నటించాడు. కాగా, బాలయ్య పాత్ర పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అదేంటంటే… ఈ సినిమాలో మెయిన్ విలన్ తండ్రి… తనకు వీరసింహారెడ్డి ఎవరో తెలియదంటూ సినిమాలో డైలాగ్ చెబుతాడు. ఎవడ్రా నా ఊరొచ్చి నన్ను ముట్టే మగాడు.. అంటూ బాలకృష్ణను నిలదీస్తాడు.

Advertisement

Read Also : అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

veerasimhareddy

దానికి సమానంగా నేనే వీరసింహారెడ్డి… పుట్టింది పులిచెర్ల… చదివింది అనంతపూర్…రూలింగ్ కర్నూల్ అంటూ బాలయ్య ఆ విలన్ కు సమాధానం ఇస్తాడు. అయితే ఈ డైలాగ్ పైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. రాయలసీమలో ఉన్నది నాలుగు జిల్లాలే. అందులో వీర సింహారెడ్డి పేరు అందరికీ తెలుస్తుంది. కానీ విలన్ ఆ మగాడు ఎవడు అంటూ… వీర సింహారెడ్డి గురించి ఏమీ తెలియదన్నట్లు డైలాగ్ చెబుతాడు. పక్కూరికి కూడా తెలియని వీర సింహారెడ్డి… ఏం ఫ్రాక్షనిస్ట్ అయ్యా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

read also : Ravanasura : రావణాసుర టీజర్ రిలీజ్… అరివీర భయంకరంగా రవితేజ

Visitors Are Also Reading