Home » Nara Lokesh : నారా లోకేష్‎కు సీఐడీ నోటీసులు..అరెస్ట్‌ చేస్తారా ?

Nara Lokesh : నారా లోకేష్‎కు సీఐడీ నోటీసులు..అరెస్ట్‌ చేస్తారా ?

by Bunty
Ad

నారా లోకేష్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. రెడ్ బుక్ అంశంపై నారా లోకేషుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నాడు అంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు సీఐడీ అధికారులు. ఈ తరుణంలోనే… కోర్టు సూచనల మేరకు లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపారు సీఐడీ. అటు నోటీసు అందుకున్నట్లు వాట్సాప్ లో సీఐడీకి సమాధానం ఇచ్చారు నారా లోకేష్. ఈ కేసు విచారణను ఇప్పటికే జనవరి తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.

nara-bramhini-and-nara-lokesh

CID notices for Nara Lokesh

అయితే.. ఈ నోటీసుల నేపథ్యంలో నారా లోకేష్‌ ను అరెస్ట్‌ చేయబోతున్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక అంతకు ముందు వ్యూహంపై స్పందించారు లోకేష్. వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుంది కదా..? అని తెలిపారు. ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయింది….ఇలాంటి సినిమాలకు జగనే డబ్బులు పంచుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఆర్జీవీ తరపున కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నది వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి…ఈ అడ్వకేట్లని చూస్తేనే ఆ సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని తెలిపారు.

Advertisement

న్యాయపరంగా మాకున్న హక్కుల కోసం పోరాడుతున్నాం….నిజంగా సినిమా తీయాలంటే హు కిల్డ్ బాబాయ్, కోడి కత్తి, ప్యాలెస్సులో జరుగుతున్న అవినీతి మీద తీయొచ్చని హెచ్చరిం చారు నారా లోకేష్‌. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే సీట్లను వైసీపీ బీసీలకు ఇస్తున్నారు….గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉన్నా.. గుంటూరు వెస్ట్ లాంటి సీటును ఆ పార్టీ గెలవలేదని ఎద్దేవా చేశారు.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading