Home » ఆడిషన్స్ కి వెళ్లి 2కాళ్లు విరగొట్టుకున్న చియాన్ విక్రమ్.. ఏం జరిగిందంటే..?

ఆడిషన్స్ కి వెళ్లి 2కాళ్లు విరగొట్టుకున్న చియాన్ విక్రమ్.. ఏం జరిగిందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు, తమిళ భాషల్లో తనదైన యాక్టింగ్ తో ఎన్నో సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్నారు విక్రం. అలాంటి విక్రమ్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి అనేక ఇబ్బందులు పడ్డారట. చివరికి ఆయన రెండు కాళ్లు కూడా విరగొట్టుకొని అనేక ఆపసోపాలు పడి మళ్లీ తెరుకొని తాను అనుకున్న లక్ష్యం సాధించడం కోసం ముందుకు సాగారని తెలుస్తోంది. అలా కష్టపడి చియాన్ విక్రంగా స్టార్ హోదాను సంపాదించుకున్నారు. మరి విక్రం జర్నీ, ఆయన కాళ్లు ఎలా విరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం.. విక్రమ్ నాన్నగారు స్కూల్ హెడ్మాస్టర్ గా ఉండేవారు. కానీ ఆయనకు సినిమాలు అంటే ఆసక్తి. దీంతో హెడ్మాస్టర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి మద్రాస్ వెళ్లారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ అంతగా సక్సెస్ కాలేకపోయారు. కానీ ఆయన కొడుకు విక్రమ్ కూడా తండ్రి కల నెరవేర్చాలని ఆశతో సినిమాల్లోకి రావాలనే ఆలోచిస్తూ ఉండేవారు.

also read:నాకు ఆ అమ్మాయి కోడలిగా కావాలంటున్న ప్రభాస్ తల్లి..!!

Advertisement

Advertisement

1983 డిగ్రీ కోసం చెన్నైలో ఉన్న లయోలా కాలేజీలో చేరారు. విక్రమ్ చిన్నప్పటినుంచి హాలీవుడ్ సినిమాలు చూస్తూ బైక్ రైడింగ్ కరాటే వంటివి నేర్చుకున్నాడు. డిగ్రీలో ఉన్న సమయంలో థియేటర్ కబ్లో చేరి నాటకాల ద్వారా నటన కూడా నేర్చుకున్నారట. అలా కొన్ని నాటకాలు కూడా వేసి సినిమాల్లో నటించాలని ఫిక్స్ అయ్యారట. నాటకాలలో మంచి పేరు తెచ్చుకొని ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సమయంలోనే ఐఐటి మద్రాసులో అవార్డు కూడా అందుకున్నారు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక అవార్డు తీసుకొని బైక్ మీద తిరిగి వస్తున్న సమయంలో ఒక ట్రక్కు విక్రమ్ బైకును గుద్దడంతో ఆయన రెండు కాళ్లు విరిగాయి. వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. తన రెండు కాళ్లు తీసేస్తేనే బతుకుతాడు అని డాక్టర్లు చెప్పారు.

also read:డబ్బు సమస్యలు ఉన్నాయా.. కర్పూరంతో ఇలా చేస్తే చాలు అన్ని లాభాలే..!!

దీంతో విక్రం కలలన్ని ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఎంతగానో ఏడుస్తూ బాధపడ్డాడు. కాళ్లు తీయకుండా ఏ రకమైన చికిత్సలున్న నేను భరిస్తాను ఎంత డబ్బు అయినా కష్టపడి పెట్టుకుంటానని డాక్టర్ ను బ్రతిమలాడాడు. ఇక డాక్టర్లు అతని బాధను చూడలేక 23 సర్జరీలు చేశారు . తన కాళ్ళను తొలగించకుండా చేశారు. అలా విక్రం కూడా రెండు ఆపరేషన్లకు మాత్రమే మత్తుమందు తీసుకున్నారట మిగతా వాటికి మత్తుమందు కూడా తీసుకోకుండా భరించారట. అలా నాలుగేళ్లపాటు అనేక కసరత్తులు చేసి మళ్లీ మామూలు మనిషి అయ్యారట.సినిమా ఛాన్సుల కోసం ట్రై చేసి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి స్టార్ హీరోగా ఎదిగారు.

also read:షాకింగ్ న్యూస్: భార్యాభర్తలు కలిసి పడుకోవడానికి ఇష్టపడడం లేదట..ఆ సర్వే ఏమందంటే..?

Visitors Are Also Reading