Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » డబ్బు సమస్యలు ఉన్నాయా.. కర్పూరంతో ఇలా చేస్తే చాలు అన్ని లాభాలే..!!

డబ్బు సమస్యలు ఉన్నాయా.. కర్పూరంతో ఇలా చేస్తే చాలు అన్ని లాభాలే..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం అనేక విధాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా పరిష్కారం దొరకదు. దీనికి కారణం వాస్తు దోషాలు, వాస్తు తప్పిదాలే ఉంటాయట. ఇంటికి వాస్తు ఉంటేనే అన్ని విధాల సమస్యలు క్లియర్ అవుతాయని నిపుణులు అంటుంటారు. ఆర్థిక సమస్యలు ఉన్నవారు చిన్న చిన్న వాస్తు చిట్కాలు పాటిస్తే మీ అన్ని సమస్యలు దూరం అవుతాయి. డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయని, వాస్తు నిపుణులు అంటున్నారు.. మరి ఆర్థిక సమస్యలు తొలగిపోయే పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

also read:తెలుగు సినిమా కాన్సెప్ట్ ని హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టారంటే నమ్ముతారా ?

Ad

ఆర్థిక సమస్యల నుండి బయట పడాలి అంటే లవంగాలు మరియు కర్పూరం ఉపయోగించి ఈ పరిహారం చేయండి. ధన నష్టంతో బాధపడుతున్న వారు ఒక గిన్నెలో రెండు లవంగాలు ఒక కర్పూరాన్ని తీసుకొని దాన్ని వంటగది వెలుపల కాల్చాలని ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయట పడవచ్చు అని అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు బాగా చికాకు పెడుతుంటే శనివారం రోజున నీటిలో కర్పూరం కలుపుకొని స్నానం చేస్తే సమస్యలు దూరం అవుతాయట.

also read:అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ‘తగ్గేదెలే’ డైలాగ్ వెనుక దాగి ఉన్న కథ ఇదే..!

అంతేకాకుండా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రావడం లేదని బాధపడే వారు కూడా స్నానం చేసిన తర్వాత ధ్యానం చేసి పూజ గదిలో ఒక ఎర్ర గులాబీ పువ్వును రెండు లవంగాలు, ఒక కర్పూరాన్ని అమ్మవారి పాదాల వద్ద సమర్పించాలని సూచిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన లాభం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Advertisement

also read:భ‌ర్త ఇంట్లో లేన‌ప్పుడు భార్య చేయ‌కూడ‌ని ప‌నులు…ఈ ప‌నులు చేశారంటే ఇక అంతే..!

Visitors Are Also Reading