Home » నటనకు బ్రాండ్ అంబాసిడర్.. గుర్తు పట్టలేని అవతారం !

నటనకు బ్రాండ్ అంబాసిడర్.. గుర్తు పట్టలేని అవతారం !

by Anji
Ad

సాధారణంగా హీరోలు తమ ఫేంకు తగినట్టు సినిమాలు చేస్తుంటారు. ఎక్స్ పరిమెంట్స్ చేసేందుకు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. ఫ్లాప్ లు వస్తే ఎక్కడ కెరీర్ డౌన్ ఫాల్ అవుతుందేమోనని భయపడిపోతుంటారు. సినిమాల కంటెంట్ విషయంలో అస్సలు రిస్క్ తీసుకోరు. అయితే కొందరూ హీరోలు మాత్రం.. సినిమా ఫలితంపై ఆధారపడకుండా ప్రతీ సినిమాకు వైవిద్యత చూపిస్తూ ప్రాణం పెట్టి నటిస్తారు. తెలుగులో ఇలాంటి హీరోలు ఒక్కరిద్దరూ మిగతా భాషల్లో మాత్రం చాలా మందే ఉన్నారు. 

Also Read :  శాకుంతలంలోని సానుమతి లుక్ లో వర్షిణి మామూలుగా లేదుగా..!

Advertisement

ఇక్కడ ఫొటోలో ఉన్న వ్యక్తి కూడా ఓ స్టార్ హీరోనే. ప్రతీ సినిమాకు తన లుక్ మార్చుకుంటూ.. వైవిద్యత చూపిస్తుంటాడు. తాజాగా ఓ కొత్త సినిమాకి హీరో మార్చిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ హీరో మరెవ్వరో కాదండోయ్.. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్. ఇప్పుడు మరోసారి డీ గ్లామరైజ్ రోల్ లో కనిపించనున్నాడు. తంగలాన్ మూవీ కోసం ఈ గెటప్ మాదిరిగా మారాడు. ప్రస్తుతం విక్రమ్ పొన్నియన్ సెల్వన్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇవాళ విక్రమ్ పుట్టిన రోజు కావడంతో ఆయన నటించిన తంగాలాన్ సినిమాకి సంబధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

Advertisement

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించగా.. విక్రమ్ తో పాటు మాలవిక మోహనన్, పార్వతి తిరువోతు నటించనున్నారు. పాన్ ఇడియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో మరోసారి విక్రమ్ నటవిశ్వరూపం చూపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మేకింగ్ వీడియో అయితే సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. 

Also Read :  “ఈ సినిమాల్లో హీరోయిన్స్ కంటే కూడా సైడ్ క్యారెక్టర్స్ ఫేమస్ !

Visitors Are Also Reading