Home » వాల్తేరు వీరయ్యలో చిరు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?

వాల్తేరు వీరయ్యలో చిరు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చిరంజీవి ఏజ్ ఉన్న హీరోలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఆరు పదుల వయస్సు దాటిన ఇప్పటికీ ఒక యంగ్ హీరో లాగా నటించడమే కాదు స్టెప్పులేస్తూ యువ హీరోలకు దీటుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజా మూవీ వాల్తేరు వీరయ్య తప్పనిసరిగా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు చిరంజీవి. ఇప్పటికే జరిగిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో సినిమా సూపర్ హిట్ అని చెప్పారు చిరంజీవి. దీనికి ప్రధాన కారణం దాని వెనుక ఉన్న సెంటిమెంట్ అని అంటున్నారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

Advertisement

చిరంజీవి కెరియర్ లో కథ విన్న వెంటనే సింగిల్ సిట్టింగ్ లో ఓకే చెబితే, ఆ మూవీ కచ్చితంగా విజయవంతమవుతుందట. ఈ విధంగా ఆయన సినీ కెరియర్ లో అనేక సూపర్ హిట్స్ వచ్చాయట. వాల్తేరు వీరయ్య కథను కూడా ఆ విధంగా సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశారని అందుకే ఆ చిత్రంపై తనకు నమ్మకం ఉందంటూ సెంటిమెంట్ ని బయటపెట్టారు చిరంజీవి.

అంతేకాకుండా మొదటి సిట్టింగ్ తర్వాత కథలో మార్పులు చేయమని అడిగిన, ఏదో మిస్ అయ్యాము అనే అనుమానం వచ్చిన సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని అలాంటి ఉదాహరణలు నా కెరియర్ లో చాలా ఉన్నాయని తెలియజేశారు. మొత్తానికి వాల్తేరు వీరయ్య మూవీపై చిరంజీవికి ఉన్న అపార నమ్మకం మరోసారి బయటకు వచ్చింది.

also read:

Visitors Are Also Reading