Home » చిరంజీవి పెళ్లి జ‌రిగిన కొత్త‌లో దర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు ట్రైన్‌లో ఏం చేశాడో మీకు తెలుసా..?

చిరంజీవి పెళ్లి జ‌రిగిన కొత్త‌లో దర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు ట్రైన్‌లో ఏం చేశాడో మీకు తెలుసా..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సినీ ఇండ‌స్ట్రీలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ మెగాస్టార్ గా ఎదిగారు. దాస‌రి నారాయ‌ణ‌రావు త‌రువాత సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌గా పేరు తెచ్చుకున్నారు. ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా మెగాస్టార్ ముందుంటారు. ముఖ్యంగా క‌రోనా స‌మ‌యం అప్పుడు.. అదేవిధంగా ఏపీలో సినిమా టికెట్ల అంశం గురించి ప్ర‌భుత్వంతో మాట్లాడే స‌మ‌యంలో.. ఇలా ప్ర‌తి విష‌యంలో ముందుండి ఇండ‌స్ట్రీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడు.

Advertisement

అయితే ఓ వీడియోలో మెగాస్టార్ స్పీచ్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ముఖ్యంగా రాఘ‌వేంద్ర‌రావు గురించి చెప్పుకొచ్చారు. రాఘ‌వేంద్ర‌రావు ఎన్నో హిట్ సినిమాలు అందించార‌ని పేర్కొన్నారు. ఆయ‌న రొమాంtik ఫెల్లో అని చెప్పుకొచ్చారు. ఆ వ‌యస్సులో కాదు.. ఈ వ‌య‌స్సులో కూడా అంతే అని.. అది ఆయ‌న సినిమాలో త‌ప్ప‌కుండా క‌నిపిస్తుంది. ఓ సినిమా షూటింగ్ స‌మ‌యంలో చిరంజీవి-సురేఖ దంప‌తుల‌కు పెళ్లి జ‌రిగిన కొత్త‌లో మేటుపాలెం నుంచి చెన్నై వ‌చ్చే ట్రైన్‌లో చిరంజీవి, సురేఖ దంప‌తులు ట్రైన్ ఎక్కారు. వారి కోసం రాఘ‌వేంద్ర‌రావు ఓ కూపీ చేశార‌ట‌. అందులో లోప‌లికి వెళ్లి చూస్తే ఫ‌స్ట్ నైట్ మాదిరిగా ఉండ‌డం చూసి మేము ఆశ్చ‌ర్య‌పోయామ‌ని చిరంజీవి చెప్పుకొచ్చారు./

Advertisement


ముఖ్యంగా పువ్వులు, పాలు, స్వీట్లు చూసి సురేఖ అయితే చాలా సిగ్గు ప‌డిపోయింది. రాఘ‌వేంద్ర‌రావు అంటేనే చిలిపి ద‌ర్శ‌కులు. రాఘ‌వేంద్ర‌రావు మ‌న‌సు ఎక్స్ రే తీస్తే దాని వ‌య‌స్సు 16 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే ఉంటుంది. ఆయ‌న మ‌న‌సు ఎప్పుడు అలాగే ఉండాలి. ఎప్పుడు ఆయ‌న ఆహ్లాద‌క‌రంగా ఉండాల‌ని చెప్పుకొచ్చారు చిరంజీవి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read : 

ఎమ్మెల్యే కి టీచ‌ర్ ఉద్యోగం వ‌చ్చింది..!

చిరంజీవితో వర్మ సినిమా ఆగిపోవడానికి కారణం.. ఆ మూవీయేనా..?

Visitors Are Also Reading