Home » చిరంజీవితో వర్మ సినిమా ఆగిపోవడానికి కారణం.. ఆ మూవీయేనా..?

చిరంజీవితో వర్మ సినిమా ఆగిపోవడానికి కారణం.. ఆ మూవీయేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే తెలియనివారుండరు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తారు ఆయన. రామ్ గోపాల్ వర్మ మరియు నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన మూవీ శివ. ఇది ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ చాలామంది రామ్ గోపాల్ మరియు చిరంజీవి కాంబినేషన్లో సినిమా రావాలని అనుకున్నారు. యూత్ లో బాగా క్రేజ్ ఉన్న వీరిద్దరూ కలిసి చేస్తే సినిమా అన్ని రకాలుగా హిట్టవుతుందని భావించారు. అందుకే వీరి కాంబినేషన్ ని కలపాలని భావించారు. కానీ అది కుదరలేదు. ఎవరి కాంబినేషన్ అయినా కలపడంలో వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ దిట్ట. ఆయన కూడా వీరి కాంబినేషన్ కలపాలని ప్రయత్నాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి తో ఒక వెరైటీ సినిమా చేయాలని రాంగోపాల్ వర్మ మనసులో ఉండటం, ఆ డైరెక్టర్ తో ఎలాగైనా పనిచేయాలని చిరంజీవి గారి కి ఉండటం వలన అశ్వినీదత్ గారి ప్రయత్నం చాలా సులువుగా అయింది.

 

 

ఆ సమయంలోనే హిట్లర్ సినిమాలో నటించడానికి నిర్మాత మోహన్ గారికి డేట్స్ ఇచ్చారు చిరంజీవి. రాంగోపాల్ వర్మ చెప్పిన సబ్జెక్టు నచ్చడం వలన అశ్వినీ దత్ గారికి కూడా డేట్స్ ఇచ్చారు చిరంజీవి. అంటే ఒక నెలలో పదిహేను రోజులు హిట్లర్ సినిమాకి, మరో పదిహేను రోజులు వర్మ సినిమాకి పనిచేయాలని ఆయన అనుకున్నారు. అదే సమయంలో సంజయ్ దత్ ఊర్మిళ జంటగా హిందీ లో దౌడ్ చిత్రం తీస్తున్నారు వర్మ.. ఆ చిత్రానికి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ ప్రారంభించే సమయంలో సంజయ్ దత్ జైలుకు వెళ్లడంతో, ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియని అయోమయ పరిస్థితి లో చిరంజీవి చిత్రం అంగీకరించారు వర్మ. 1996 కర్ణాటకలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. చిరంజీవి ఊర్మిళ పై ఒక పాట కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. తొలి షెడ్యూల్ పూర్తయింది. ఇంతలో బెయిల్ దొరికిన సంజయ్ దత్ జైలు నుంచి విడుదలయ్యారు.

Advertisement

Advertisement

దౌడ్ సినిమా పూర్తి చేసి ఆ తర్వాత చిరంజీవి గారితో షూటింగ్ చేద్దామని అనుకున్నారు వర్మ. ఆ తర్వాత చిరంజీవి గారు ఒప్పుకొన్నారు. దీని తర్వాత నెల రెండు నెలలు మూడు నెలలు వెయిట్ చేశారు చిరంజీవి. ఎంతకీ దౌడ్ సినిమా పూర్తి కాకపోవడంతో, ఆయన సహనానికి పరీక్ష పెట్టిందని చెప్పవచ్చు. ఒకపక్క హిట్లర్ సినిమా షూటింగ్ పూర్తికావస్తునన్నా కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది చిరంజీవికి. ఇలా ఎంతకాలం ఈ వెయిటింగ్ అని తెలియకపోవడంతో మెగాస్టార్ చేయవలసిన ఇతర చిత్రాల షూటింగ్ కూడా దెబ్బతిన్నాయి. ఒక వ్యక్తి కోసం ఒక చిత్రం కోసం ఇలా నెలల తరబడి వెయిట్ చేయడం ఇతర నిర్మాతలను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని చిరంజీవికి అనిపించింది. వెంటనే ఆయన కొత్త సినిమాలకు పచ్చజెండా ఊపారు. ఈ సమయంలోనే చిరంజీవి వర్మ కాంబినేషన్లో మంచి సినిమా వస్తుందని భావించిన ఫ్యాన్స్ కు ఎదురు దెబ్బ తగిలింది.

ALSO READ;

న‌య‌న‌తార విఘ్నేష్ శివ‌న్ జంట‌ హ‌నీమూన్ కోసం ఎక్క‌డికి వెళ్లారో తెలుసా..?

బాలయ్య బాబు ఆ హీరోయిన్ ని అంతలా ప్రేమించాడా ? ఎన్టీఆర్, హరికృష్ణ లు ఎందుకు పెళ్ళికి ఒప్పుకోలేదు ?

 

Visitors Are Also Reading