Home » Chiranjeevi : “భోళా శంకర్” నిర్మాతకు చిరంజీవి భారీ సాయం ?

Chiranjeevi : “భోళా శంకర్” నిర్మాతకు చిరంజీవి భారీ సాయం ?

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలకు ఆయన ఆదర్శంగా నిలిచారు. ఇండస్ట్రీలోకి ఎంతో కష్టపడి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది.. మొదట్లో అంటే జనవరిలో వాల్తేరు వీరయ్య…. సినిమాతో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి… మంచి సక్సెస్ అందుకున్నారు.

Advertisement

అదే ఊపుతో… బోలా శంకర్ సినిమాను ఇటీవల రిలీజ్ చేశారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ సినిమా వచ్చింది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా అనిల్ సుంకర పనిచేశారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా భాటియా హీరోయిన్గా నటించగా… ఆయన చెల్లెలిగా కీర్తి సురేష్ నటించిన అందరిని మెప్పించింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా దారుణంగా వచ్చాయి. ఓవరాల్ గా బోలాశంకర్ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

Advertisement

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారట. బోలా శంకర్ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ ను తిరిగి వెనకకు ఇచ్చారట. ఈ సినిమా కోసం ఏకంగా 60 కోట్లు చిరంజీవి తీసుకున్నారట. అందులో 50 కోట్లు సినిమా ప్రారంభానికి ముందే.. చిరంజీవికి ప్రొడ్యూసర్స్ ఇచ్చారట. మిగతా పది కోట్లు మాత్రం చెక్ రూపంలో ఇచ్చారట.అయితే ఆ చెక్ ను ఇప్పటివరకు చిరంజీవి తన అకౌంట్ లో డిపాజిట్ చేయించుకోలేదు. అయితే సినిమా అట్టర్ ఫ్లాప్ అని టాక్ రావడంతో… ఆ చెక్ ను తిరిగి నిర్మాతలకు ఇచ్చారట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిరంజీవిని అందరూ మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి 

Big Boss 7 : నాగార్జున బిగ్ బాస్ 7 రెమ్యూనరేషన్ 200 కోట్లు ?

ఆ స్టార్ హీరో కోసం 6 రోజులు అన్నం మానేసిన శ్రీదేవి…?

Virat Kohli : వరల్డ్‌ కప్‌ కోసం కోహ్లీకి డైమండ్‌ బ్యాట్‌..!

Visitors Are Also Reading