Home » Big Boss 7 : నాగార్జున బిగ్ బాస్ 7 రెమ్యూనరేషన్ 200 కోట్లు ?

Big Boss 7 : నాగార్జున బిగ్ బాస్ 7 రెమ్యూనరేషన్ 200 కోట్లు ?

by Bunty
Ad

 

నాగార్జున హోస్ట్ గా చేసేటువంటి బిగ్ బాస్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇది ఓ రియాలిటీ షో. ఇప్పటికే బిగ్ బాస్ 6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఏడవ సీజన్లోకి అడుగుపెట్టబోతోంది. ఇక త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కాబోతోందని నాగార్జున అనౌన్స్ చేశారు. ఇంతకుముందులాగ కాకుండా ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు.

Advertisement

ఇక ఈ సీజన్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే నాగార్జున బిగ్ బాస్ లో హోస్ట్ గా చేసినందుకుగాను 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఒక సినిమాలో చేసినందుకు కూడా ఇన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోడు అని కొంతమంది నెటిజన్స్ అంటున్నారు. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే నాగార్జున రెమ్యూనరేషన్ కి సంబంధించిన అసలు నిజం బయటపడింది.

Advertisement

nagarjuna ap tickets issue

నాగార్జున ఒక్క ఎపిసోడ్ కి గాను 12 నుంచి 14 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. ఇక ఒక సీజన్ అంతా కలిపి దాదాపు 20 కోట్లు కూడా దాటదని అంటున్నారు. ఈసారి అంతా ఉల్టా పుల్టా అన్నందుకేమో 20 పక్కన ఇంకో సున్నాని చేర్చారు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సీజన్లో చాలామంది సెలెబ్రిటీలు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దాదాపు 20 మంది సెలబ్రిటీలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి 

ఆ స్టార్ హీరో కోసం 6 రోజులు అన్నం మానేసిన శ్రీదేవి…?

Virat Kohli : వరల్డ్‌ కప్‌ కోసం కోహ్లీకి డైమండ్‌ బ్యాట్‌..!

140 కిలోల బరువు.. తొలి బంతికే పరుగెత్తి రనౌట్‌ అయిన విండీస్‌ బాహుబలి..

Visitors Are Also Reading