Home » మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లో మధ్యలోనే నిలిచిపోయిన చిత్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ? ఒక హాలీవుడ్ సినిమాతో..పాటు

మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లో మధ్యలోనే నిలిచిపోయిన చిత్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ? ఒక హాలీవుడ్ సినిమాతో..పాటు

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి సొంత టాలెంట్ తో స్టార్ గా మారిపోయారు. ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీకే పెద్ద దిక్కుగా మారిపోయారు. ఇక చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఉన్నాయి. ఫ్లాప్ ల విష‌యానికి వ‌స్తే మెగాస్టార్ కెరీర్ లో చాలా త‌క్కువ ఫ్లాప్స్ ను చూశారు. ఇదిలా ఉండ‌గా చిరంజీవి హీరోగా న‌టించాల్సిన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ మ‌ధ్యలోనే ఆగిపోయాయి.

Advertisement

అవేంటో ఇప్పుడు చూద్దాం….చిరంజీవి అశ్వినిద‌త్ కాంబినేష‌న్ భూలోక‌వీరుడు అనే సినిమాను అనుకున్నారు. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిచాల్సి ఉండ‌గా క‌థ‌లో తేడా అనిపించి ఈ సినిమాను మ‌ధ్య‌లోనే ఆపేశారు. ఆర్జీవి చిరుల కాంబినేష‌న్ లో ఇలాంటి సినిమానే మ‌రొక‌టి అనుకున్నారు. ఊర్మిళ‌, టబుల‌ను హీరోయిన్ లుగా తీసుకున్నారు. ఒక పాట కూడా షూటింగ్ పూర్త‌య్యింది.

Advertisement

కానీ ఈ సినిమా కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అబు అనే పాన్ ఇండియా సినిమాను అప్పుడే మొద‌లు పెట్టారు. గ‌జ‌దొంగ క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కాల్సింది. నిజానికి ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అదే విధంగా శ్రీదేవి చిరంజీవి హీరో హీరోయిన్ లుగా వ‌జ్రాల దొంగ అనే క్రేజీ ప్రాజెక్ట్ మొద‌ల‌య్యింది.

ఈ సినిమాను కోదండ‌రామిరెడ్డి ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమా కూడా కొన్ని కార‌ణాల వ‌ల్ల మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా అనుకున్నారు. పూజా కార్య‌క్ర‌మాలు కూడా పూర్తయ్యాయి. కానీ ఈ సినిమా కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అదే విధంగా వ‌రుస ల‌వ్ స్టోరీల‌తో సూప‌ర్ హిట్స్ అందుకున్న వీఎన్ ఆదిత్య చిరంజీవి తో ఓ సినిమా ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాకు కూడా బ్రేక్ ప‌డిపోయింది. ఇలా చిరు కెరీర్ లో ఎన్నో సినిమాలు మ‌ధ్యలోనే ఆగిపోయాయి.

also read :మీనా-విద్య సాగర్ ల పెళ్లి తిరుపతిలో ఎవరు జరిపించారు ? పెళ్ళికి ముందు పెట్టిన కండిషన్స్ అవేనా ?

Visitors Are Also Reading