Home » ఎన్టీఆర్ కి RRR లో నిజంగానే అన్యాయం జరిగిందిగా ! మరి ఇదేంటి జక్కన్నా ?

ఎన్టీఆర్ కి RRR లో నిజంగానే అన్యాయం జరిగిందిగా ! మరి ఇదేంటి జక్కన్నా ?

by AJAY
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ అభిమానులు నిరాశ చెందిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు ప్రాధాన్యత తక్కువ ఇచ్చారని కేవలం రామ్ చరణ్ పాత్రకు సపోర్టింగ్ గా ఎన్టీఆర్ పాత్ర ఉందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఎన్టీఆర్ అభిమాని ఒకరు సినిమాలో కొమరం భీమ్ పాత్ర ఎలివేషన్ కు సంబంధించిన సీన్లను లేపేశానని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సినిమాలో నటించిన ఓ నటుడు ఇంటర్వ్యూలో చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో నటుడు….. తాను ఎన్టీఆర్ తో ఓ సన్నివేశంలో నటించానని చెప్పారు. తర్వాత తనకు ఎనిమిది నెలల తర్వాత ఫోన్ వచ్చిందని తెలిపారు.

Advertisement

అప్పుడు అజయ్ దేవ్ గన్ తో ఎపిసోడ్ లో నటించడానికి పిలిచారని చెప్పాడు. గతంలో ఎన్టీఆర్ తో నటించిన సన్నివేశానికి ఇది కొనసాగింపా అని తాను అడగ్గా ఆ సీన్ కు కొనసాగింపు కాదని ఆ సన్నివేశాన్ని రాజమౌళి లేపేశారని చెప్పినట్టు తెలిపారు. ఇది కొత్త సీన్ అని అజయ్ దేవ్ గన్ తో కొన్ని సన్నివేశాలు ఉంటాయని చెప్పినట్టు పేర్కొన్నాడు. అంతేకాకుండా ఎడిటింగ్ లో తీసేసిన ఎన్టీఆర్ సీన్ గురించి చెబుతూ….. తామంతా ఖైదీలుగా జైల్లో ఉన్న సమయంలో ఎన్టీఆర్ దెబ్బలుతిని గాయాలతో వస్తాడని చెప్పాడు.

RRR FIRST RIVEW

RRR FIRST RIVEW

అప్పుడు జైల్లో ఉన్న ఖైదీలు అంతా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి బ్రిటిష్ వాళ్లను ఉచ్చ పోయించాడు…. నాయకుడు అంటూ నినాదాలు చేసే సీన్ అని చెప్పారు. ఆ సీన్ థియేటర్ లో పడి ఉంటే గూస్ బంప్స్ వచ్చేవని చెప్పాడు. ఆ సీన్ లో కొమరం భీమ్ ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పాడు. ఇక అలాంటి సీన్ ను రాజమౌళి ఎందుకు కట్ చేశారని ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Also read :

యాంక‌ర్ శ్రీముఖి సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌డం వెన‌క ఇంత క‌థ జ‌రిగిందా…!

నాగార్జున అలా అన‌డంతో కృష్ణ ఫ్యాన్స్ కొట్ట‌డానికి వ‌చ్చార‌ట‌..అస‌లేం జ‌రిగిదంటే..!

Visitors Are Also Reading