Home » చిరు తో మాములుగా ఉండదు మరి..! ‘వాల్తేర్ వీరయ్య’ ప్రీ రిలీజ్ఈవెంట్ లో చిరంజీవి లీక్ చేసిన విషయాలు ..!

చిరు తో మాములుగా ఉండదు మరి..! ‘వాల్తేర్ వీరయ్య’ ప్రీ రిలీజ్ఈవెంట్ లో చిరంజీవి లీక్ చేసిన విషయాలు ..!

by AJAY

మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాలో న‌టించారు. ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా చిరుకు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్ గా నటించింది. భారీ బ‌డ్జెట్ తో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమాను నిర్మించారు. ఇక సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేయ‌గా భారీ రెస్పాన్స్ వ‌స్తోంది. యూట్యూబ్ లో మిలియ‌న్ వ్యూవ్స్ తో ట్రైల‌ర్ దూసుకుపోతోంది.

Also Read:   శాకుంతలం ట్రైలర్ లో అల్లు అర్హ లుక్ ని చూశారా..? ఎలా ఉందంటే..?

waltair-verayya-review

waltair-verayya-review

ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే సినిమా విడుద‌ల నేప‌థ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేశారు. కాగా ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ హైలెట్ గా నిలిచింది. అయితే చిరంజీవి ఉప్పెన సినిమా నుండి లీక్ రాయుడుగా మారిపోయాడు. ఉప్పెన సినిమా క్లైమాక్స్ గురించి చిరంజీవి ఆ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో లీక్ చేయ‌డంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారాడు.

ఆ త‌ర‌వాత ఆచార్య సినిమా గురించి కూడా కొన్ని విష‌యాలు లీక్ చేశాడు. అంతే కాకుండా చిరు తాజాగా న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమా షూటింగ్ లో ఫోన్ ప‌ట్టుకుని మంచు కొండ‌ల్లోని సీన్ ల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అయ్యింది. ఇదిలా ఉంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా చిరు కొన్ని విష‌యాలు లీక్ చేశాడు.

waltair-verayya

వాల్తేరు వీర‌య్య లో మొద‌టి 25 నిమిషాల్లో రెండు ఎపిసోడ్ లు హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి. అవి ఏంటంటే….అని చెబుతుండ‌గా మ‌ధ్య‌లో బాబీ అడ్డు ప‌డ్డాడు. దాంతో చిరు మొత్తం లీక్ చేస్తున్నానా అంటూ ఆపేశాడు. ఇక చిరు చేసిన లీక్ తో మొద‌టి 25 నిమిషాలు సినిమా ర్యాంప్ అని ప్రేక్ష‌కుల‌కు అర్థం అయ్యింది.

Also Read:  Chiranjeevi: మరోసారి కొరటాల శివపై సెటైర్లు వేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

Visitors Are Also Reading