Home » Chiranjeevi: మరోసారి కొరటాల శివపై సెటైర్లు వేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

Chiranjeevi: మరోసారి కొరటాల శివపై సెటైర్లు వేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆచార్య.ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. అయితే ఇందులో మొదట చిరంజీవి సరసన కాజల్ ని హీరోయిన్ గా తీసుకొని కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక ఆమెను అందులో నుండి తీసివేశారు. అయితే ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.అయితే మొదట్లోనే ఈ సినిమా గురించి రాంచరణ్ చిరంజీవి ఇద్దరు వారి నోళ్లతో వాళ్లే స్వయంగా ఈ సినిమా బాలేదు అని చెప్పారు. దాంతో ఈ సినిమా డిజాస్టర్ ఫలితం మొత్తాన్ని డైరెక్టర్ కొరటాల శివ మీదనే వేశారు.

Advertisement

also read:దర్శకుడు బాబీకి గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక మరదలు అవుతుందనే విషయం మీకు తెలుసా..? 

అయితే ఇప్పటికి కూడా వీరు ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఓ సందర్భంలో ఇండైరెక్టుగా కొరటాల శివ మీద కొన్ని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి అలాంటి కామెంట్లే చేశారట. మరి ఇంతకీ చిరంజీవి ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్లే సినిమాకి డైరెక్షన్ వహించిన బాబీ చాలా మంచి మనస్తత్వం ఉన్న డైరెక్టర్ ఆయన ఎవరు ఏం చెప్పినా దానిలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహిస్తారు. కానీ వీరేంటి నాకు చెప్పేది నాకు తెలియదా అని అసలు వినకుండా ఊరుకోరు.ఏ విషయం చెప్పినా కూడా పెడచెవిన పెట్టకుండా వింటారు. అంతేకాదు ఏదైనా విషయం చెబితే వీరు ఇన్ని సినిమాలు చేశారు. వీరికి సినిమాలో ఎంతో అనుభవం ఉంది.

Advertisement

అందుకే వీరి మాటలు వినాలి అని చెప్పిన ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారు.అంతేకాదు ఈ సినిమా సక్సెస్ కావాలని రాత్రింబవళ్లు ఆయన కష్టపడ్డారు. ఏదైనా సీన్ విషయంలో బాగా లేదంటే దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకొని ఆ సీన్ బాగా వచ్చేవరకు ప్రయత్నం చేసేవారు. ఆయన తన డైరెక్షన్ టీం తో కలిసి చాలా ప్రయత్నాలు చేశారు అంటూ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి డైరెక్టర్ బాబిని చాలా మెచ్చుకున్నారు. ఇక చిరంజీవి చెప్పిన మాటలను సరిగ్గా గమనిస్తే గనుక ఆయన ఇండైరెక్టుగా కొరటాల శివ పై కామెంట్స్ చేస్తున్నట్లుగా ఉంది అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన చాలామంది మరోసారి కొరటాల శివ పై సెటైర్ వేస్తున్నారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading