Home » చిరూకు చెల్లిగా చేశారు.. తర్వాత హీరోయిన్‍గా చేస్తారా..? కీర్తి సురేశ్‍ ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన మెగాస్టార్..!

చిరూకు చెల్లిగా చేశారు.. తర్వాత హీరోయిన్‍గా చేస్తారా..? కీర్తి సురేశ్‍ ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన మెగాస్టార్..!

by Mounika
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా ఈ ఆగస్టు 11వ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్లలో వేగం జరుగుతున్నాయి. ఈ రోజు (ఆగస్టు 6) సాయంత్రం భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. అందుకోసం మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ తమన్నా భాటియా, కీర్తి సురేశ్, దర్శకుడు మెహర్ రమేశ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. కమెడియన్ గెటప్ శ్రీను వారిని ప్రశ్నలు అడగటం జరిగింది. ఈ క్రమంలోనే చిరంజీవి మరియు కీర్తి సురేశ్‍కు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు సమాధానంగానూ చిరంజీవి తనదైన స్టైల్ లో  అద్భుతంగా సమాధానాలు చెప్పారు.

bola Shankar interview

Advertisement

భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేశ్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంతో గెటప్ శ్రీను తర్వాతి సినిమాల్లో చిరంజీవి పక్కన హీరోయిన్‍గా నటించే ఛాన్స్ వస్తే చేస్తారా అని కీర్తి సురేశ్‍ను  ప్రశ్నించారు.  దీనికి గాను కీర్తి సురేశ్ తప్పకుండా చేస్తానని సమాధానం ఇచ్చారు. అయితే, భోళా శంకర్‌తో పోలిస్తే క్యారెక్టర్‌ విభిన్నంగా ఉండాలని కీర్తి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రశ్నకు కీర్తి కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనిపించడంతో చిరంజీవి కల్పించుకొని సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు.

Advertisement

రేప్పొద్దున హీరోహీరోయిన్లుగా ఛాన్స్ వస్తే చేస్తారా.. అనే డౌట్ నీకు ఎందుకు వచ్చిందంటూ గెటప్ శ్రీను ని ప్రశ్నించారు చిరంజీవి. ఈ సినిమాలో చెల్లిగా చేస్తే.. రేపు చెలిగా చేయకూడదా.. సఖిగా చేయకూడదా.. చేస్తాం అంటూ చిరు తనదైన స్టైల్ లో  సమాధానమిచ్చారు. అంతేకాకుండా సీనియర్ ఎన్టీఆర్, మహానటి సావిత్రి గురించి గుర్తు చేశారు. రక్త సంబంధం సినిమాలో మహానటి సావిత్రి, రామరావు గారు అన్నా చెల్లెలిగా నటించలేదా.. ఆ తర్వాత సుఖదుఃఖాలు లాంటి చిత్రాల్లో  హీరోహీరోయిన్లుగా నటించారు. ఆటోమేటిక్‍గా యాక్సప్టెన్స్ వస్తుంది అని చిరంజీవి సమాధానమిచ్చారు.

 ప్రేక్షకులు ఏ సినిమాని ఆ సినిమాగానే చూస్తారు తప్ప.. ఆ సినిమాలో అన్నా చెల్లెళ్లుగా చేశారు కదా అని.. లైఫ్‍టైమ్ మమ్మల్ని అన్నా చెల్లెళ్లుగా చేయకండి. నాకు ఇష్టం లేదు.. అని కీర్తి సురేశ్ చేయి పట్టుకొని నవ్వుతూ చిరంజీవి సరదాగా చెప్పుకొచ్చారు. పాత్రలు అనేవి కేవలం సినిమాల వరకే  సినిమా  అని చిరంజీవి చెప్పడంతో.. కీర్తి సురేశ్ కూడా నవ్వుతూ ‘ఎస్.. నేను కూడా’ అని సమాధానమిచ్చారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

శంకర్ మూవీలో రామ్ చరణ్ పాత్రల పేర్లు ఇవే..!

ఆ పని చేయడం కోసం కిడ్నీలు అమ్ముకున్న బలగం హీరో…! వైరల్ అవుతున్న పోస్ట్..!

ఆనందం మూవీ హీరోయిన్ రేఖ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…? 

Visitors Are Also Reading